ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ స్టార్ట్..!
TeluguStop.com

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో వచ్చే ఢీ షో రీసెంట్ గా 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ పూర్తి చేసుకుంది.


ఈ సీజన్ లో లేడీ కంటెస్టెంట్ కావ్య టైటిల్ గెలుచుకుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ ట్రోఫీ అందుకుంది.


ఇక గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ చేత ఢీ 14 లోగో కూడా రిలీజ్ చేయించారు.
ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ గా ప్రోగ్రామ్ రానుంది.ఈ షోతో మరోసారి ఢీ షో సత్తా చాటనుంది.
సౌత్ డ్యాన్స్ షోల్లో ఢీ అతిపెద్ద క్రేజీ డ్యాన్స్ ఫ్లాట్ ఫామ్ గా మారింది.
ఇక్కనుండి ఎంతోమంది డ్యాన్సర్స్, మాస్టర్స్ వస్తున్నారు.ఓ రకంగా టాలెంట్ ఉన్న వారికి ఇదొక మంచి వేదిక అని చెప్పొచ్చు.
13 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ షో ఇప్పుడు 14వ సీజన్ కు రెడీ అవుతుంది.
తప్పకుండా ముందు సీజన్లలానే ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ కూడా అదేవిధంగా డ్యాన్స్ ప్రియులను అలరించే అవకాశం ఉందని ఫిక్స్ అవ్వొచ్చు.
ఐకాన్ స్టార్ తో లోగో రిలీజ్ చేయించగా ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ కోసం కూడా ఫైనల్ ఎపిసోడ్ కోసం బన్నీ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉంది.
అదే విషయాన్ని యాంకర్ ప్రదీప్ బన్నీ ని ఉద్దేశించి అన్నాడు.ఢీ 3 కి గెస్ట్ గా వచ్చిన బన్నీ ఢీ 13కి వచ్చాడు.
30 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీస్.. తర్వాతేం జరిగిందో చూడండి..