కూతురు అర్హ చేసిన పనికి మురిసిపోతున్న ఐకాన్ స్టార్… అసలేం చేసిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు(Allu) వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈయన క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా తాకిందని చెప్పాలి.

పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా(Paan India) స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. """/" / ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈయన తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నటువంటి క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను షేర్ చేయడంతో ఈయనకు ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక ఈయనకు షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

"""/" / అల్లు అర్జున్ ముఖ్యంగా అర్హ (Arha)తో కలిసి ఆడుకుంటూ సరదాగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఈయన తాజాగా ఒక ఫోటోని షేర్ చేయగా ఇది వైరల్ గా మారింది.

ఇందులో అల్లు అర్జున్ సోఫాలో కూర్చుని ఉండగా అర్హ యోగాసనాలు చేస్తూ ఉన్నారు.

ఇలా తన కూతురు యోగాసనాలు చేస్తూ ఉండటంతో అల్లు అర్జున్ ఎంతో మురిసిపోతున్నారు.

ఇక ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ అర్హ మల్టీ టాలెంటెడ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక నాలుగేళ్ల వయసులోనే అర్హ సినిమా ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టారు.ఈమె సమంత(Samantha) నటిస్తున్నటువంటి శాకుంతలం(Shaakuntalam) సినిమాలో చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించారు.

విజయ్ త్రిష మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు.. జస్టిస్ ఫర్ సంగీత అంటూ?