Allu Arjun Ayaan : అయాన్ మోడల్ బోల్తే అంటూ కొడుకు పై కామెంట్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa )ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో కూడా అభిమానులు పెరిగిపోయారు.
ఇక అల్లు అర్జున్ వ్యక్తిగత విషయానికొస్తే స్నేహారెడ్డి( Sneha Reddy ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు సంతానం అయితే అల్లు అర్జున్ కుమారుడు అయాన్( Ayaan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
"""/" /
అయాన్ కి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే ఈ వీడియోలు అన్నిటిలో కూడా ఆయన చాలా ఫన్నీ ఫన్నీగా యాక్టింగ్ చేస్తూ అందరిని తెగ నవ్విస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే అయాన్ కి సంబంధించిన వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అయాన్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇకపోతే అల్లు అర్జున్ ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో( Berlin Film Festival ) పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
"""/" /
ఈ కార్యక్రమం అనంతరం ఈయన మీడియాతో ముచ్చటించారు.ఈ క్రమంలోనే పలువురు ఆయన గురించి ప్రశ్నించారు.
స్టేజ్ పై బన్నీ మాట్లాడుతుండగా.మీ బుడ్డోడు ఎలా ఉన్నాడు అన్నా అంటూ ఓ అభిమాని అడిగేశాడు.
దీంతో బన్నీ నవ్వుతూ.అయాన్.
మోడల్ బోల్తే అంటూ అయాన్ సిగ్నేచర్ ను షేర్ చేశాడు.ఇక తన కొడుకు గురించి బన్నీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అయాన్ పేరు కూడా వైరల్ అవుతుంది.
ఇక అల్లు అర్జున్ పుష్ప2( Pushpa 2 ) సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!