స్మగ్లర్ పాత్రైనా అవార్డ్ అందుకే ఇచ్చారన్న బన్నీ.. నా భార్య కన్నీళ్లు పెట్టుకుందంటూ?

స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) కు నేషనల్ అవార్డ్ రావడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే సంగతి తెలిసిందే.

పుష్ప ది రైజ్ సినిమాలో బన్నీ స్మగ్లర్ రోల్ పోషించారని ఆ పాత్రకు అవార్డ్ ఎలా ఇస్తారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ వైరల్ అవుతున్న ప్రశ్నలకు సంబంధించి తనదైన శైలిలో క్లారిటీ ఇవ్వడం గమనార్హం.

తెలుగులో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్న బన్నీ మాట్లాడుతూ 2021 సంవత్సరంలో మా సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని అయితే సినిమా అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది కాబట్టి అవార్డులు రాకపోవడానికి నేపథ్యం సహకరించకపోవచ్చని భావించానని బన్నీ తెలిపారు.

ఉత్తమ నటుడు పురస్కారానికి ( Best Actor Award )నాణ్యమైన నటనే ప్రామాణికమని భావించి నాకు అవార్డ్ ఇచ్చారని బన్నీ అన్నారు.

"""/" / ఉత్తమ నటుడు విభాగంలో నా పేరు తెరపై కనిపించిన వెంటనే సుకుమార్ గారిని హత్తుకున్నానని బన్నీ అన్నారు.

ఇది నా పురస్కారం కంటే సుకుమార్ కు వచ్చిన పురస్కారం అనుకోవాలని అల్లు అర్జున్ కామెంట్లు చేశారు.

సుకుమార్( Sukumar ) నాతో "నువ్వు వైర్ కాదు డార్లింగ్.ఫైర్" అని అన్నాడని బన్నీ చెప్పుకొచ్చారు.

నాకే తొలిసారి అవార్డ్ వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయానని అల్లు అర్జున్ తెలిపారు. """/" / అవార్డులు వచ్చినా రాకపోయినా మరింత ఉత్తమంగా పని చేయడం నాకు తెలుసని బన్నీ అన్నారు.

నా అభిమానులే నా బలం వాళ్లే నా బలగం అని బన్నీ చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ లో కూడా భవిష్యత్తులో సినిమాలు చేస్తానని బన్నీ అన్నారు.నాకు జాతీయ పురస్కారం వచ్చిన సమయంలో నా భార్య కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారని బన్నీ చెప్పుకొచ్చారు.

బన్నీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికాలో అక్రమ నివాసం .. 18000 వేల మంది భారతీయుల బహిష్కరణకు ఏర్పాట్లు