మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ! బన్నీ అన్న కూడానా

మెగా ఫ్యామిలీ హీరోలతో ఇప్పటికే ఇండస్ట్రీ నిండిపోయింది.మొత్తం వాళ్ళ హీరోలు అందరూ కలిపితే ఒక ఫుట్ బాల్ జట్టు అవుతుంది.

అంతగా ఇండస్ట్రీకి హీరోలని డంప్ చేసిన మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.

అయితే ఆ హీరో ఇప్పటికే భాగా ముద్రిపోయాడు.అతను అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి.

సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఇన్ని రోజులు వ్యాపారాలు చూసుకుంటున్న బాబికి కూడా సినిమాలలో నటించాలనే కోరిక పుట్టినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో తన ఆలోచనని ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాడని టాక్.ఇటీవల తన కంటే వయసులో చాలా చిన్నదైన ఓ యోగా టీచర్ ని రెండవ వివాహం చేసుకొని టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన బాబి ఇప్పుడు మరోసారి మీడియాలో ప్రముఖంగా నిలిచాడు.

మొదట క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిచయం అయ్యి, ఆ తర్వాత తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలతో హీరోగా కూడా చేయాలని భావిస్తున్నాడు.

అదే సమయంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మాణ బాద్యతలు కూడా చూసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే తండ్రి వారసత్వం కొనసాగిస్తూ ఇప్పటికే సినీ నిర్మాణంలో వెనకుండి చూసుకుంటున్న బాబిని ఇప్పుడు నటుడుగా ఇండస్ట్రీ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటుంది అనేది చూడాలి.

అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. మాధవీలత షాకింగ్ కామెంట్స్ వైరల్!