మావయ్య కోసం పొలిటికల్ కార్యక్రమానికి వెళ్తున్న బన్నీ.. 10,000 మందికి చీరలు పంపిణీ చేస్తూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కు( Allu Arjun ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో( Pushpa 2 ) నటిస్తున్న బన్నీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
పుష్ప2 క్వాలిటీ విషయంలో సుకుమార్ రాజీ పడటం లేదని అందుకే సినిమా లేట్ అవుతోందని తెలుస్తోంది.
అయితే ఈరోజు బన్నీ నల్గొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి వెళ్లనున్నారని సమాచారం.తన మామ, బీ.
ఆర్.ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి( Chandrasekhar Reddy ) స్వగ్రామం దగ్గర నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
కంచర్ల కన్సెన్షన్ పేరుతో ఈ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు.చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే పెద్దవూర మండల కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తోంది.
"""/" /
చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ ఫంక్షన్ హాల్ 1000 మందికి సరిపడేలా ఉందని భోగట్టా.
బన్నీతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.
ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా 10,000 మందికి భోజన కార్యక్రమాలతో పాటు మహిళలకు చీరల పంపిణీ( Sarees ) చేయనున్నారని తెలుస్తోంది.
బన్నీ హాజరవుతూ ఉండటంతో కొంతమంది ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. """/" /
ఈ వేడుక ఒక విధంగా పొలిటికల్ వేడుక కాగా ఈ ఈవెంట్ లో బన్నీ పాల్గొనడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
బన్నీ రేంజ్, క్రేజ్, ఫాలోయింగ్, పాపులారిటీ వేరే లెవెల్ అని రాబోయే రోజుల్లో బన్నీకి మరిన్ని భారీ విజయాలు సొంతమవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బన్నీ పుష్ప2 సినిమాతో మరోమారు ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిన వరుణ్ తేజ్