టీడీపీ నేత ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్… వైరల్ అవుతున్న ఫోటోలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతూ ఉండగానే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలవడింది. """/" / ఈ సినిమా మహాభారతం నేపథ్యంలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

అయితే ఇలా సినిమా షూటింగ్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉండగా ఉన్నఫలంగా ఇతను ఒక టిడిపి నేత ఫామ్ హౌస్ లో సందడి చేయడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా టిడిపి నేత ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్ సందడి చేయడమే కాకుండా అక్కడ రాయలసీమ వంటకాల రుచిని చూశారు.

అసలు టిడిపి నేత ఫామ్ హౌస్ కి అల్లు అర్జున్ ఎందుకు వెళ్లారు ఏంటి అనే విషయానికి వస్తే.

"""/" / అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా మార్గమధ్యమంలో గార్లదిన్నె మండలం కనంపల్లి వద్ద ఆగారు.

దీంతో అల్లు అర్జున్ కు టిడిపి నాయకుల నుంచి తన ఫామ్ హౌస్ కి స్వాగతం పలికారు.

శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి ( Muntimadugu Keshavareddy )అల్లు అర్జున్ ని తన ఫామ్ హౌస్ లోకి తీసుకుని వెళ్లారు.

ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి( Rahul Reddy ) కూడా బన్నీకి వెల్ కమ్ చెప్పారు.

ఇలా తమ ఫామ్ హౌస్ కి అల్లు అర్జున్ ఆహ్వానించడమే కాకుండా ఆయనకు రాయలసీమ వంటకాల రుచి చూపించారు.

ఇలా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు.

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కు జాతీయ అవార్డ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!