అల్లు అర్జున్ ఆస్తులు అన్ని వేల కోట్లా..?
TeluguStop.com
గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్( Allu Arjun ) ఈ సినిమా హిట్ అవ్వడం తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ ఈ సినిమా ఆయనకి హిట్ అయితే ఇచ్చింది కానీ క్రేజ్ నిటివ్వలేకపోయింది దానితో ఆయన తన రెండోవ సినిమాగా సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య సినిమా సూపర్ హిట్ అయింది ఇక దానితో ఆయన స్టైలిష్ స్టార్ గా మారిపోయారు.
ప్రస్తుతం ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్నాడు.అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు,( Chiranjeevi ) అంతే కాదు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కొడుకు అంతేకాకుండా ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) మనవడు.
ఇంత గొప్ప ప్రముఖులు ఆయన వెనక ఉన్నా .వారసత్వంగా కాకుండా తన ప్రతిభతో అదరగొట్టి ఎంతోమంది అభిమానుల్ని పొందారు .
డ్యాన్సులతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు.అల్లు అర్జున్ కి తెలుగు లోనే కాదు, మలయాళంలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.
అందుకే అక్కడ ఆయన్ని మల్లు అర్జున్ అని కూడా అంటూ అంటారు.ఈ మధ్య వచ్చిన పుష్ప సినిమాతో తెలుగు, మలయాళం లోనే కాకుండా ఇండియా మొత్తంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.
ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న మన బన్నీ ఆస్తుల విలువ పై కూడా తరచూ చర్చలు సాగుతూ ఉంటాయి .
"""/" /
బన్నీ ఒక్కో సినిమాకు దాదాపు 30 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది.
గతేడాది అల్లు అరవింద్ ఆస్తులు కూడా పంచేయడంతో బన్నీ ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ కొత్తగా కట్టుకుంటున్న ఇంటి ఖరీదు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా దాంతో పాటు బిజినెస్‌లో కూడా బన్నీ ఆరితేరారని చెబుతారు .
హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రముఖ పబ్‌లలో ఒకటి అల్లు అర్జున్‌దే అంతేకాదు కార్ వ్యాన్ విషయంలో కూడా బన్నీ ఏ మాత్రం తగ్గట్లేదు.
ప్రత్యేకంగా 7 కోట్లు పెట్టి డిజైన్ చేయించుకున్నాడు ఇక బన్నీ ఇటీవలే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాల కాలాన్ని పూర్తిచేసుకున్నారు.
"""/" /
ఈ 20 సంవత్సరాల కాలంలో వేల రూపాయల సంపాదన నుంచి సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం కోట్లను ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు.
స్టైలిష్ స్టార్ ఆస్తుల నికర విలువ వందల కోట్లలోనే ఉంటుందని చెబుతారు.అల్లు అర్జున్ దగ్గర ఉన్న రేంజ్ రోవర్ , హమ్మర్ , జాగ్వార్, వోల్వో ఎక్సలెన్స్ , మెర్సిడెస్ , బిఎండబ్యు , ఫాల్కన్ వానిటీ వాన్ ఉన్నాయి అలాగే నార్సింగ్ లోని అల్లు స్టూడియోస్ , అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్, అలాగే ఓ ఫామ్ హౌస్ , జూబ్లీహిల్స్‌లో ఒక విలాసవంతమైన భవనం బన్నీ సొంతం.
అలాగే భార్య ద్వారా కూడా భారీగానే ఆస్తులు వచ్చాయి అని చెబుతారు .
వీటన్నిటి మార్కెట్ విలువ భారీగానే ఉంటుందని చెప్పవచ్చు.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు ఈ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ రేమూరేశన్ ఇంకా భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?