ఏపీలోని ఆ జిల్లాలో బన్నీ ఎఎఎ సినిమాస్.. అక్కడ కూడా క్లిక్ కావడం పక్కా!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ), ఆసియన్ సినిమాస్ కాంబినేషన్ లో హైదరాబాద్ లో నిర్మాణమైన మల్టీ ప్లెక్స్ ఎఎఎ( Multiplex AAA ).
అయితే ఇప్పుడు మళ్లీ అదే ఎఎఎ ఇప్పుడు విశాఖలో కూడా రాబోతోంది.దాదాపుగా ఏడాది నుంచి చర్చలు, అగ్రిమెంట్ దశలో వుందీ వ్యవహారం.
అన్ని అగ్రిమెంట్లు పూర్తయి కూడా మంచి ముహుర్తాలు లేక, అలా వుండిపోయింది.కానీ ఇప్పుడు శ్రావణమాసం వస్తుండడంతో పూజా కార్యక్రమం నిర్వహించి, పనులు మొదులుపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.
"""/" /
ఆసియన్ సునీల్ నారంగ్,( Asian Sunil Narang ) అల్లు అర్జున్ భాగస్వామ్యంలో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మాణం జరుగుతోందట.
విశాఖలో ప్రతిష్టాత్మక ఇనార్బిట్ మాల్ నిర్మాణం మొదలై చాలా కాలమైంది.ఆ మాల్ లోనే ఈ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది.
ఆరు లేదా ఏడు స్క్రీన్ లు వుండే విధంగా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు.
చాలా విలాసవంతంగా, అందంగా వుండేలా ఇంటీరియర్ డిజైన్ ను ప్లాన్ చేస్తున్నారట.అయితే ఎటువంటి హంగులు ఆర్బాటలు లేకుండా పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణాన్ని ప్రారంభించనున్నారట.
కాగా ఇప్పటికే విశాఖలో మూడు మూడు మల్టీ ప్లెక్స్ లు వున్నాయి.అలాగే గాజువాకలో కూడా వున్నాయి.
"""/" /
ఈ మధ్య ఉత్తరాంధ్ర అంతా సినిమా కలెక్షన్లు పెరగడానికి కారణం మూడు జిల్లాల్లో మంచి స్క్రీన్ లు ఎక్కువగా రావడమే.
ఇప్పుడు ఈ ఎఎఎ తో మరి కొన్ని స్క్రీన్ లు యాడ్ అవుతాయి.
అయితే ఈ స్క్రీన్లు కూడా తప్పకుండా క్లిక్ అవడం పక్క అని తెలుస్తోంది.
దానికి తోడు సినిమాలు విడుదల అయినప్పుడు మరిన్ని కలెక్షన్లు సాధించిన అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మర్.. ఐశ్వర్య రాజేష్ క్రేజీ కామెంట్స్ వైరల్!