అల్లు అర్జున్ ముసలోడు కాబోతున్నాడా?
TeluguStop.com
మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముసలోడు కాబోతున్నాడా అంటూ సినీ వర్గాల వారు అవును అంటూ సమాధానం ఇస్తున్నారు.
ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు అల్లు అర్జున్‌ను యూత్ స్టార్‌గా, యంగ్ హీరోగా, స్టైలిష్ స్టార్‌గా చూడటం జరిగింది.
అయితే మొదటి సారి అల్లు అర్జున్‌ను మిడిల్ ఏజ్ వ్యక్తిగా, యంగ్ కుర్రాడికి తండ్రిగా చూడబోతున్నాం.
నాలుగు పదుల వయసు దాటిన వ్యక్తిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
"""/"/
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఆ చిత్రం తర్వాత సుకుమార్ మరియు వేణు శ్రీరామ్‌లకు బన్నీ ఓకే చెప్పాడు.
సుకుమార్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ సినిమా ఉండే అవకాశం ఉంది.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందబోతున్న చిత్రానికి 'ఐకాన్' అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది.
ఇప్పటికే టైటిల్ లోగోను ఆవిష్కరించారు.దిల్‌రాజు నిర్మించబోతున్న ఆ చిత్రం గురించిన విషయం ఒకటి లీక్ అయ్యింది.
"""/"/
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకానం ఐకాన్ చిత్రంలో అల్లు అర్జున్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.
ఆ పాత్రల్లో ఒకటి నాలుగు పదుల వయసు దాటిన ముసలోడు పాత్ర అని సమాచారం అందుతోంది.
మరి కొందరు అయిదు పదుల వయసు అని కూడా అంటున్నారు.భారత్ సినిమాలో సల్మాన్ ఖాన్ లుక్ తరహాలో అల్లు అర్జున్ ఓల్డ్ లుక్ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది.
మొత్తానికి అల్లు అర్జున్ ఏదో పెద్ద ప్రయోగం చేయబోతున్నాడు.అది ఎంత వరకు సక్సెస్ అయ్యేనో చూడాలి.
స్విగ్గి చేసిన ప్రకటనపై మండిపడుతున్న దుకాణదారులు