అల్లు అర్జున్ అరెస్టు… వైరల్ అవుతున్న వేణు స్వామి వీడియో!
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్( Allu Arjun Arrest ) అయిన విషయం తెలిసిందే.
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా ఓ మహిళా అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ కారణంగానే అభిమాని మరణించింది అంటూ ఈయన పై కేసు వేయగా పోలీసులు తనని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
"""/" /
ఇక ఈయన జైలుకు వెళ్ళగానే కోర్టు మధ్యంతర బెయిలు ఇవ్వడంతో నేడు ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారు.
ఈ తరుణంలోనే గతంలో అల్లు అర్జున్ గురించి వేణు స్వామి చెప్పినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో భాగంగా వేణు స్వామి( Venu Swamy ) మాట్లాడుతూ అల్లు అర్జున్ అసలైన పాన్ ఇండియా స్టార్ హీరో ఆయనకు ఇకపై కెరియర్ పరంగా తిరుగులేదు ఆయనకు రాజయోగం కలుగుతుంది అంటూ వేణు స్వామి చెప్పిన ఒక వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
"""/" /
వేణు స్వామి అల్లు అర్జున్ కేరియర్ కు తిరుగులేదని ఆయనకు రాజయోగం ఉంటుందని చెప్పడంతో రాజయోగం అంటే ఇదేనా అంటూ ఆయనని పోలీసులు తీసుకెళ్తున్న వీడియోని కలిపి మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇలా మరోసారి వేణు స్వామి జాతకం అల్లు అర్జున్ విషయంలో తప్పు కావడంతో పలువురు ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక ఇటీవల పుష్ప సినిమా చూసిన వేణు స్వామి మరోసారి ఈయన గతంలో అల్లు అర్జున్ గురించి చెప్పిన వీడియోలను కూడా షేర్ చేయడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తూ వేణు స్వామి పై విమర్శలు కురిపిస్తున్నారు.
వైరల్ వీడియో: కుక్క చేసిన పనికి చప్పట్లు కొట్టిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే..