అల్లు అర్జున్ – త్రివిక్రమ్.. ఇంతకు ఏంటి ఆ ప్లానింగ్ చెప్పరేం!
TeluguStop.com
అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 ) షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ఆ భారీ సినిమా తో పాటు త్రివిక్రమ్ ( Trivikram ) దర్శకత్వం లో ఒక సినిమాను కమిట్ అవ్వడం జరిగింది.
ఒక వైపు పుష్ప 2 సినిమా ను చేస్తూ మరో వైపు ఇలా త్రివిక్రమ్ కు ఓకే చెప్పడం అందరికి షాకింగ్ గా ఉంది.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జులాయి.సన్నాఫ్ సత్యమూర్తి మరియు అల వైకుంఠపురంలో సినిమా లు వచ్చాయి.
మూడు సినిమా లు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.
రికార్డ్ స్థాయి లో వసూళ్లు సాధించిన ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయాలని భావిస్తున్నారు.
"""/" /
అందుకు అనుగుణంగా వీరి కాంబోలో మరో సారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొందరు ఆసక్తిగా ఉన్నారు.
వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో అనూహ్యంగా త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబోలో ఒక ఓటీటీ మూవీ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.
ఆహా( Aha OTT ) కోసం వీరిద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారు.అది ఎందుకు అనే విషయం లో అనే విషయమై క్లారిటీ లేదు.
"""/" /
కానీ కచ్చితంగా వీరిద్దరి కాంబోలో ఓటీటీ మూవీ లేదా వెబ్ సిరీస్ రాబోతుంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యం లో ముందు ముందు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరో వైపు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల అవ్వబోతుంది.ఈ లోపే త్రివిక్రమ్ వెళ్లి అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ అంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీ లో బాబు బిజీ బిజీ.. వీరందరితోనూ భేటీ