అల్లు అర్జున్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్... సుకుమార్ ఏమంటారో!
TeluguStop.com
అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప సినిమా గత సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని దేశ వ్యాప్తంగా ఈ సినిమా రాబట్టింది.
కేవలం హిందీ వర్షన్ 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టడం తో అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంవత్సరం ఆరంభం లోనే అంటే ఫిబ్రవరి లోనే పుష్ప పార్ట్ 2 నీ మొదలు పెట్టాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకు అధికారికంగా సినిమా పట్టాలెక్కలేదు.అందుకు కారణం బాలీవుడ్ లో ఈ సినిమా పై ఉన్న అంచనాలే ఎంత అంచనాలు ఉంటే మాత్రం సంవత్సరం పాటు స్క్రిప్ట్ వర్క్ చేస్తారా అంటూ అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు సినిమా ను అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది అంటూ ఇటీవల సుకుమార్ కాంపౌండ్ నుండి వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా స్క్రిప్టు వరకు జరుగుతుందని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది అని, """/"/
అందుకే సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను మరి కొన్ని రోజులు వాయిదా వేస్తే బాగుంటుందని అల్లు అర్జున్ వద్ద సుకుమార్ అన్నాడని.
అందుకు అల్లు అర్జున్ కూడా సరే అన్నాడని వార్తలు వస్తున్నాయి.సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల కోసం అల్లు అర్జున్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఈ సమయం లో సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారికి పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.
సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది లో విడుదల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయా.. న్యాయ నిపుణులు చెప్పిన విషయాలివే!