లారీ డ్రైవర్ గా స్టైలిష్ స్టార్... అయ్యే పనేనా...

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్యాలిక్యులేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ గురించి ప్రస్తుతం కొన్ని వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నటువంటి అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని పలు వార్తలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

అంతేగాక ఇప్పటికే అల్లు అర్జున్ కూడా 10 చక్రాల లారీని  నడిపే శిక్షను కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఈ చిత్రం ఓ ఎర్రచందనం స్మగ్లింగ్ అనే ట్యాగ్ లైన్ చుట్టూ తిరుగుతుందని ఇందులో ముఖ్యంగా లారీతో చేంజ్ చేసే సన్నివేశాలు కీలకమని అందువల్లనే అల్లుఅర్జున్ లారీ నడపడంలో శిక్షణ తీసుకుంటున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు.

అంతేకాక ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కూడా ఓ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.

మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది.అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై వస్తున్నటువంటి ఈ వార్తల గురించి దర్శకుడు సుకుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో అనే చిత్రంలో నటించాడు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.అంతేకాక ఇతర దేశాల్లో పలు నాన్ బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టింది.

దీంతో ఇదే ఊపులో బన్నీ తన తదుపరి చిత్రాన్ని కూడా విడుదల చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

 .

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??