ఆ కొత్త ఏటీటీ వెనుక అల్లు అర్జున్‌ ఉన్నాడా?

ఆ కొత్త ఏటీటీ వెనుక అల్లు అర్జున్‌ ఉన్నాడా?

అల్లు అరవింద్‌ మై హోమ్స్‌ వారితో కలిసి 'ఆహా' ఓటీటీని మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

ఆ కొత్త ఏటీటీ వెనుక అల్లు అర్జున్‌ ఉన్నాడా?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరియు భవిష్యత్తులో ఓటీటీలతో పాటు ఏటీటీలకు కూడా మంచి డిమాండ్ ఉంది.

ఆ కొత్త ఏటీటీ వెనుక అల్లు అర్జున్‌ ఉన్నాడా?

ఏటీటీ అంటే ఎనీ టైమ్‌ థియేటర్‌.ఇక్కడ సినిమా చూడాలన్నా వెబ్‌ సిరీస్‌ చూడాలన్నా మరే షో చూడాలన్నా కూడా ఆ షో లేదా సినిమాకు సంబంధించిన టికెట్‌ను కొనుగోలు చేయాలన్నమాట.

అంటే థియేటర్‌ లో ఎలా అయితే సినిమాను చూసేందుకు టికెట్‌ను కొనుగోలు చేసుకుంటామో అలాగే ఇందులో అలా అన్నమాట.

ఓటీటీ అంటే ఒక్కసారిగా సంవత్సర చందా కడితే అందులో వచ్చేవి అన్ని కూడా చూడవచ్చు.

ఈ పద్దతి సినిమా నిర్మాతలకు పెద్దగా ప్రయోజనకరం కాదు.అందుకే ఏటీటీని తీసుకు వచ్చేందుకు ప్రముఖులు సిద్దం అవుతున్నారు.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలో బన్నీ వాసు ఒక ఏటీటీని ప్రారంభించబోతున్నాడు.

ఈయన ఇప్పటికే కొన్ని సినిమాలను సైతం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.బన్నీ వాసు మరియు మరో ప్రముఖ వ్యాపారవేత్త కలిసి ఈ ఏటీటీను ప్రారంభించే యోచనలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇప్పటి వరకు ఒకే ఒక్క ఏటీటీ ఉంది.ఈ సమయంలో బన్నీ వాసు ఏటీటీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

బన్నీ ఏం పని చేసినా కూడా అల్లు అరవింద్‌ లేదా అల్లు అర్జున్‌ నూటికి నూరు శాతం ఉంటాడు అనడంలో సందేహం లేదు.

అల్లు అరవింద్‌ ఇప్పటికే ఆహాలో భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే.కనుక అల్లు అర్జున్‌ ఈ ఏటీటీ వెనుక ఉండి ఉంటాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ప్రతి ఒక్కరు కూడా ఏటీటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఉన్న ఏటీటీకి పెద్దగా పబ్లిసిటీ దక్కలేదు.

దీనికి బన్నీ నుండి కాని మరో పెద్ద స్టార్‌ నుండి కాని పబ్లిసిటీ దక్కితే ఖచ్చితంగా మరో రేంజ్‌ లో ఆ ఏటీటీ సత్తా చాటే అవకాశం ఉందంటున్నారు.