నువ్వంటే నాకు పిచ్చి.. మరీ ఇంత క్యూట్ గా ఎందుకున్నావు.. కూతురిపై బన్నీ ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కుటుంబ సభ్యులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కూతురు అర్హ అంటే బన్నీకి ప్రాణమనే సంగతి తెలిసిందే.గుణశేఖర్ డైరెక్షన్( Directed By Gunasekhar ) లో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో అర్హ నటించగా ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిలైనా అల్లు అర్హ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

అయితే అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం సందర్భంగా బన్నీ అర్హ గురించి ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

"""/" / ఆ వీడియోలో బన్నీ అర్హను( Arha ) ఎత్తుకుని ఎందుకు నువ్వు ఇంత క్యూట్ గా ఉన్నావ్.

కొంచెం క్యూట్ అయితే ఓకే.మరీ ఇంత క్యూట్ గా ఉన్నావ్ అంటూ కూతురిని ముద్దాడారు.

నువ్వంటే నాకు చాలా ఇష్టం.నువ్వంటే నా ప్రాణం అంటూ బన్నీ కూతురిపై ప్రేమను చాటుకున్నారు.

కూతురు అంటే పిచ్చి అంటూ బన్నీ అర్హపై తనకు ఉన్న పిచ్చిప్రేమను చాటుకోవడం గమనార్హం.

బన్నీ పోస్ట్ చేసిన ఈ వీడియోకు 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

"""/" / అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమలో( Pushpa2 ) నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.గుంటూరు కారం సినిమాలో సైతం అల్లు అర్హ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

నటన విషయంలో అల్లు అర్హను బన్నీ పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నారు.బన్నీ పుష్ప2 సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్నారు.

ఎన్నో ప్రత్యేకతలతో పుష్ప2 సినిమా తెరకెక్కుతుండగా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది.

బన్నీ తర్వాత సినిమాలు కూడా భారీ సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!