ఆహా కోసం మరోసారి జత కట్టిన త్రివిక్రమ్-అల్లు అర్జున్
TeluguStop.com
త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజా అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.
ఇప్పుడు ఎన్టీఅర్ తో సినిమా కోసం సన్నాహాలు మొదలెట్టారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
త్రివిక్రమ్ సినిమాలతో అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు.వాటిలో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ తో కమర్షియల్ యాడ్ కోసం జత కడుతున్నట్లు తెలుస్తుంది.
వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో' చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అహ పేరుతో డిజిటల్ వీడియో ప్లాట్‌ఫాం ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.
ఇప్దీపటికే దీని మీద వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.అలాగే కొత్త సినిమాలు కూడా కొంటున్నారు.
అయితే దీనిని ప్రస్తుతం బూమ్ లో ఉన్న మిగిలిన డిజిటల్ ప్లాట్ ఫాం స్థాయికి తీసుకొని వెళ్ళాలంటే కచ్చితంగా ప్రమోషన్ కావాలి.
దానికోసం అల్లు అరవింది కొడుకుని ఉపయోగించుకుంటున్నాడు.అల్లు అర్జున్ తో ఒక ప్రమోషనల్ యాడ్ ని షూట్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.
ఇది త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది.
చరణ్ కియరా జోడికి కలసి రాలేదా…అప్పుడు అలా… ఇప్పుడు ఇలా?