తెరమీద 'ఊ అంటావా' సాంగ్ ఉంటది సామీ.. చూడాల్సిందే అంటున్న పుష్పరాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప.

ఈ సినిమా ఈ నెల 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ చాలా సేపు మాట్లాడారు.అల్లు అర్జున్ చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరి గురించి, తన ఫ్యాన్స్ గురించి ఈ వేదికపై మాట్లాడారు.

''పుష్ప, పుష్ప రాజ్ భాషలో మాట్లాడాలంటే.ఏందబ్బా ఎట్లా ఉన్నారు.

శానా దినాలైనది మిమ్మల్ని కలిసి.ఏందీ రచ్చ.

ఆ పొద్దు తగ్గేదేలే.అంటూ పుష్పరాజ్ మొదలు పెట్టడంతో ఫ్యాన్స్ ఊగిపోయారు.

ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ.నేను సరదాగా అంటూ ఉంటాను అందరికి ఫ్యాన్స్ ఉన్నారు.

నాకు మాత్రం ఆర్మీ ఉంది అని.నేను లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్నాను అంటే అది మీరు ,మీ ప్రేమ.

"""/" / నాకు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏమీ లేదు.అంటూ అల్లు అర్జున్ తెలిపారు.

ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా ఊ అంటావా.ఊఊ అంటావా మామ.

సాంగ్ గురించి కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. """/" / ఈ సినిమాలో ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంది.

ఫాస్టెస్ట్ సౌత్ ఇండియా అంటే మాములు విషయం కాదు.సాంగ్ ''ఊ అంటావా.

ఊఊ అంటావా మామ'' సాంగ్ ఈ సినిమాకే హైలెట్.ఇక తెరపై ఈ సాంగ్ ఉంటది సామీ.

చూడాల్సిందే.అంటూ పుష్పరాజ్ ఈ సాంగ్ గురించి తెలిపాడు.

  ఇక సమంత గురించి చెప్పాలంటే ఆమెకు ముందుగా థాంక్స్ చెప్పాలి.ఇలాంటి స్పెషల్ సాంగ్ లో కొన్ని కొన్ని చేయమంటారు.

కానీ సామ్ మాత్రం నేను ఏమి అడిగిన కాదనకుండా చేసింది.అంటూ సమంతను కూడా పొగడ్తలతో ముంచెత్తాడు.

జూనియర్ ఎన్టీఆర్ ల్యాండ్ వివాదం లో అసలు నిజాలు… లోగుట్టు పెరుమాళ్ కి ఎరుక..