‘శాకుంతలం’లో అర్హ స్క్రీన్ టైం పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగకుండానే విడాకులు తీసుకున్నారు.ఇక విడాకుల తర్వాత సామ్ మళ్ళీ తన సినీ కెరీర్ కొనసాగిస్తుంది.

బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.

ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకున్న ఈమె ఈ మధ్యనే షూట్ లో పాల్గొంటుంది.

ఇటీవలే ఈమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ సెట్స్ లో జాయిన్ అయ్యి బిజీగా ఉంది.

"""/"/ ఇదిలా ఉండగా ఈమె నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.

ఈ సినిమాను ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయడానికి సిద్ధం అవుతున్నారు.

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఇంకా దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఖచ్చితంగా హిట్ అవుతుంది అని టీమ్ అంతా ధీమాగా ఉన్నారు.

"""/"/ ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.

ఈమె గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.ఈమె స్క్రీన్ స్పేస్ గురించి డైరెక్టర్ గుణశేఖర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు.

అల్లు అర్హ ఈ సినిమాలో దాదాపు 6 నిముషాల పాటు కనిపిస్తుంది అని చెప్పాడు.

దీంతో అల్లు అర్హ యాక్టింగ్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనిల్ రావిపూడి…