అమెజాన్‌తో పోటీకి సై అంటోన్న మెగా ప్రొడ్యూసర్

టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలను అతి తక్కువ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియోకు గట్టి ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

సినిమా నిర్మాణంతో పాటు థియేట్రికల్ రైట్స్‌లో తన సత్తా చాటిన అల్లు అరవింద్, డిజిటల్ ప్లాట్‌ఫాంపై కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా తనకంటూ ఓ సొంత ఓటీటీ వేదికను క్రియేట్ చేయాలని అల్లు అరవింద్ చూస్తున్నారు.

దీని కోసం మ్యాట్రిక్స్ ప్రసాద్(మా చానెల్ అధినేత).మై హోమ్ రామేశ్వరరావు(10 టీవీ - టీవీ9 అధినేత)లతో చేతులు కలిపి అల్లు అరవింద్ ఈ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వచ్చే సినిమాలన్నింటినీ ఈ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ ఓటీటీ వేదికకు ‘ఆహా’ అనే పేరు పెట్టి దీన్ని లాంఛ్ చేశారు.

గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ‘ఆహా’ వేదికపై ప్రస్తుతానికి ఉన్న సినిమాలను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంది.

మరి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లకు ఆహా ఎలాంటి పోటీని ఇస్తుందో చూడాలి.

ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగం అభివృద్ధి..: మంత్రి బొత్స