సాయి పల్లవి కూతురితో సమానం.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి( Sai Pallavi ) త్వరలోనే నాగచైతన్య( Nagachaitanya ) సరసన నటిస్తున్న తండేల్( Thandel ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి విడుదల తేదీని కూడా అధికారకంగా తెలియజేశారు.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/" / ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య జోడిగా నటిస్తున్నారు.

ఒక జాలరి నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దాదాపు 80% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది  నాగచైతన్య సినీ కెరియర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు  రాబోతోంది.

ఇక ఇటీవల ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్( Allu Aravind ) సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

"""/" / ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సాయి పల్లవి నటనపై ప్రశంశల వర్షం కురిపించారు.

ఇటీవల సాయి పల్లవి నటించిన అమరన్( Amaran ) సినిమా చూశానని సాయి పల్లవి తన నటనతో అదరగొట్టిందని తెలిపారు.

ఇక చివరిలో అందరిని ఏడిపించిందని కూడా తెలిపారు.ఈ సినిమా క్లైమాక్స్ చూసి నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి బరువెక్కిన హృదయంతో బయటకు వచ్చాను.

అదే ఎమోషన్ లో కారులో కూర్చొని సాయి పల్లవికి ఫోన్ చేసి మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు.

నాకు కూతుర్లు లేరు కూతురు కనుక ఉండి ఉంటే సాయి పల్లవిలా ఉండాలని కోరుకుంటాను ఆమె నాకు కూతురితో సమానం అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఇయర్ లో భారీ విజయాలను సాదించిన టాప్ 3 ఇండియన్ సినిమాలు ఇవేనా..?