కమెడియన్ అలీపై ఫైర్ అయిన అల్లు అరవింద్.. కారణం ఏమిటంటే?

బుల్లితెరపై అలీ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్నటువంటి ఆలీతో సరదాగా కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రతివారం ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతూ వారి కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ తాజాగా తన తండ్రి అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ ప్రారంభించిన విషయాల గురించి ముచ్చటించారు.

ఇకపోతే అలీ తాను అల్లు రామలింగయ్య గారు నటించిన 22 సినిమాలలో తన కొడుకుగా నటించానని చెప్పడంతో అల్లు అరవింద్ ఆశ్చర్యపోయారు.

ఆయనకి మీరు పెద్ద కొడుకు అయితే నేను రెండవ కొడుకు అంటూ అలీ చెప్పారు.

మరి ఇప్పుడు ఆస్తిలో వాటా ఏమైనా అడుగుతున్నావా అంటూ ప్రశ్నించగా ఆ లెక్కలు తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను అంటూ అల్లు అరవింద్ సరదాగా సమాధానం చెప్పారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ ను అలీ ప్రశ్నిస్తూ మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఉన్న డిస్టబెన్స్ వచ్చిందంటూ ప్రశ్నలు వేశారు.

"""/"/ ఈ విధంగా ఈ రెండు కుటుంబాల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని అలీ ప్రశ్నించడంతో ఒక్కసారిగా అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు.

మీరు కాంట్రవర్సీ ప్రశ్నలు అడుగుతామంటే ముందే చెప్పమని చెప్పాను కదా లేదు సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉంటాయని చెప్పారు మరి ఇదేంటి అంటూ ఈయన అలీపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

మరి ఈ విషయం గురించి వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రస్తావన జరిగింది అలీ అడిగిన ప్రశ్నకు అరవింద్ ఏమని సమాధానం చెప్పారు అనే విషయం తెలియాలంటే అక్టోబర్ 10వ తేదీ వరకు వేచి ఉండాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి3, శుక్రవారం 2025