అలా చేయగలిగే వాడు మాత్రమే అసలైన హీరో.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ప్రముఖ నిర్మాత, స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )తండ్రి అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలిసిందే.
అరవింద్ ప్రస్తుతం వరుసగా సినిమాలను నిర్మిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అరవింద్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సిల్వర్ స్క్రీన్ పై అసలు సిసలు హీరోలు ఎవరు అన్న విషయం గురించి తాజాగా చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.
ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్లతో గట్టెక్కించేవాడే హీరో అని తెలిపారు.
"""/" /
ఒకవేళ చిన్న మీడియం హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో షో నుంచే మొత్తం షెడ్డు కు వెళ్తుంది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.
కానీ ఓ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్లు వచ్చాయంటే అతడే రియల్ హీరో అన్నట్టుగా అల్లు అరవింద్ మాట్లాడారు.
కాగా అల్లు అరవింద్ చేసిన వాక్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవ్వడంతో ఆ మాటల్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ (
Ram Charan )డిజాస్టర్, ఫ్లాప్ సినిమాలు సైతం మంచి కలెక్షన్లను రాబట్టాయంటూ లెక్కలు చెబుతున్నారు.
రచ్చ, నాయక్ వంటి సినిమాలే 40 కోట్ల షేర్ వరకు రాబట్టాయని ఆనాటి రోజుల్ని గుర్తు చేస్తున్నారు.
"""/" /
కానీ బన్నీ ఫ్లాప్ చిత్రాలకు ఆ రేంజ్ కలెక్షన్లు మాత్రం రాలేదని ట్రోలింగ్ చేస్తున్నారు.
అసలే ఇప్పుడు ఎక్కువగా నెట్టింట్లో మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా నడుస్తోంది.ఇప్పుడు అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని కూడా ఇలా తమ ఫ్యాన్ వార్‌లో కలిపేసుకుంటున్నారు.
అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక అల్లు అరవింద్ మాటలు అయితే మరోమారు ఫ్యాన్ వార్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
అభిమానానికి జోహార్.. నేతాజీ ఆకారంలో 913 కి.మీ. రూట్ మ్యాప్..