అల్లు అరవింద్ బన్నీని అలా పెంచారా.. కార్లు ఉన్నా అలా చేయడంతో?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ అలీతో సరదాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నాన్న అల్లు రామలింగయ్య 1000కు పైగా సినిమాలలో నటించారని నాకు తెలుసని నాకు తెలిసి నాన్న పదో తరగతి కూడా పూర్తి చేసి ఉండరని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

నాన్నకు సూరి నారాయణ అనే స్నేహితుడు ఉండేవాడని ఆయనను స్పూర్తిగా తీసుకుని నాన్న హోమియోపతి నేర్చుకున్నారని అల్లు అరవింద్ వెల్లడించారు.

అమ్మ వయస్సు 92 సంవత్సరాలు అని అమ్మకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

మేము మొత్తం ఐదుగురమని అన్నయ్య, అక్క ఇప్పటికే చనిపోయారని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.

నా భార్య నిర్మల ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని నాకు ఆడపిల్లలు అంటే ఇష్టమని ఆడపిల్ల ఉంటే బాగుండని అప్పుడప్పుడూ అనిపిస్తుందని అయితే ఆ లోటును మేనకోడళ్లు తీర్చారని అల్లు అరవింద్ వెల్లడించారు.

నాన్న బాల్యంలో మిడిల్ క్లాస్ లో పెంచారని అల్లు అరవింద్ అన్నారు.మిడిల్ క్లాస్ జీవనం సాగిస్తేనే ప్రేమానురాగాలు తెలుస్తాయని నా పిల్లలు బన్నీ, శిరీష్, బాబీలకు మిడిల్ క్లాస్ లో ఉండటం నేర్పించానని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.

బన్నీ, మిగతా పిల్లలను స్కూల్ కు స్కూల్ బస్ లోనే పంపించానని అల్లు అరవింద్ అన్నారు.

ఇంట్లో కార్లు ఉన్నా ఆ విధంగా చేశానని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.తెనాలిలో చేసిన నాటకం వల్ల నాన్నకు సినిమాలలో ఆఫర్లు వచ్చాయని అల్లు అరవింద్ అన్నారు.

"""/"/ నాన్న తనకు తెలిసిన మంత్రి ద్వారా నాకు స్టేట్ బ్యాంక్ లో జాబ్ ఇప్పించాలని అనుకున్నారని నేను మాత్రం జాబ్ చెయ్యను బిజినెస్ చేస్తానని చెప్పానని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

అప్పట్లో నిర్మాతలు యజమానులలా ఉండేవారని ఇప్పుడు హీరోలు యజమానులలా మారారని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.

మా నాన్న ఎవరితో పోటీ పెట్టుకోలేదని అల్లు అరవింద్ అన్నారు.

ఈ ఆయిల్ ను వాడితే పురుషులకు బట్టతల భయమే అక్కర్లేదు!