కేంద్ర బడ్జెట్‎లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు..!

కేంద్ర బడ్జెట్‎లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు జరిగాయి.ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.

37 కోట్లు కేటాయించారు.ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.

47 కోట్లను కేంద్రం కేటాయించింది.ఏపీ పెట్రోలియం వర్సిటీకి రూ.

168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు కేటాయింపులు జరిగాయి.

అటు తెలంగాణలోని సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్ కు ఈఏపీ కింద రూ.

300 కోట్లతో పాటు మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు రూ.

6,835 కోట్లను బడ్జెట్ లో కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

అదేవిధంగా సాలార్ జంగ్ సహా అన్ని మ్యూజియంలకు రూ.357 కోట్లు,.

మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు కేటాయించారు.

కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లు కాగా తెలంగాణ వాటా రూ.

21,470 కోట్లను కేంద్రం బడ్జెట్ లో కేటాయించింది.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేరళ ఎన్ఆర్ఐల క్యూ.. పార్టీల ప్రత్యేక ఏర్పాట్లు