ఎన్డీయే వ్యూహం.. కలిసొచ్చెదేవరు ?

2024 సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు.సరిగా 9 నెలలు మాత్రమే సమయం ఉంది.

ఈసారి కూడా నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది.2014 నుంచి ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ గత ఎన్నికల్లో ప్రత్యర్థుల సపోర్ట్ లేకుండానే అధికారంలోకి వచ్చింది.

అదే విధంగా ఈసారి కూడా 350 సీట్లకు పైగా కైవసం చేసుకొని ఎవరి అండ లేకుండానే ఎన్డీయే ను అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఎన్డీయేతో కలిసి నడిచే పార్టీలపై బీజేపీ( BJP ) దృష్టి సారించింది.

ఈ నెల 18 న ఎన్డీయే మిత్రా పక్షాల కూటమి సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి ఏ ఏ పార్టీలు హాజరవుతాయనేది అత్యంత కీలకం.ఎందుకంటే ఈ సమావేశంతోనే ఎన్డీయేతో చేతులు కలిపే పార్టీలు ఏవనేది తేలిపోనుంది.

"""/" / అలాగే ఈ సమావేశంలో జరిగే చర్చలు, పొత్తులు, ఒడంబడికలు వచ్చే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయనున్నాయి.

అందుకే 18న జరిగే ఎన్డీయే మిత్రపక్షాల కూటమిని బీజేపీ కీలకంగా తీసుకుంది.వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని బీజేపీ చెబుతున్నప్పటికి.

కర్నాటక ఎన్నికల ప్రభావం బీజేపీపై ఎంతో కొంత ఉంది.అందుకే పొత్తుల విషయంలో త్వరగా స్పష్టత వస్తే తదుపరి ఎన్నికల వ్యూహాలను మరింత చురుకుగా నిర్వర్తించవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

గత ఎన్నికల ముందు ఎన్డీయే లో భాగస్వాములుగా ఉన్న టిడిపి, జేడీయూ, శివసేన ( ఉద్దవ్ థాక్రే వర్గం ) ఎన్డీయే నుంచి బయటకు వచ్చాయి.

దాంతో ఈసారి ఈ పార్టీల మద్దతు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. """/" / గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ( TDP ) తిరిగి ఎన్డీయే లో చేరాలని తెగ ఆరాటపడుతోంది.

ఈ నేపథ్యంలో 18న జరిగే సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందుతుందా లేదా అనేది చూడాలి.

ఇక బిహార్ లోని రాజకీయ పరిణామాల కారణంగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ పార్టీ తిరిగి ఎన్డీయేకు మద్దతు పలుకుతుందా అనేది ప్రశ్నార్థకమే.

అలాగే మహారాష్ట్రలోని శివసేనతో కలిసి గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించింది బీజేపీ.

అయితే ఆ తరువాత శివసేన రెండుగా చీలడం.ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీకి మద్దతుగా ఉన్నప్పటికి ఉద్దవ్ థాక్రే( Uddhav Thackeray ) వర్గం బీజేపీకి యాంటీ గా మారడం జరిగిపోయాయి.

ఇటు ఎన్సీపీకూడా ఈసారి ఎన్డీయే కూటమికి యాంటీగానే మారిపోయింది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే తో కలిసి నడిచే పార్టీలు ఎవనేది అంచనాలకు కూడా అందని పరిస్థితి.

మొత్తానికి ఈ నెల 18న జరిగే సమావేశంతో ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే పార్టీలు ఎవనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నవంబర్ 13న జో బైడెన్‌తో భేటీ కానున్న డొనాల్డ్ ట్రంప్