పొత్తు స్టీరింగ్ జనసేన చేతిలోనే ?

దశాబ్ద కాల రాజకీయ ప్రయాణంలో జనసేన( Janasena ) ఎన్నో ఉద్దాన పతనాలను చూసింది.

ముఖ్యంగా అధినాయకుడు రెండు చోట్లా ఓడిపోయిన స్థితి నుంచి ఈరోజు రాబోయే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత పాత్ర వరకు జనసేన గ్రాఫ్ అనేకసార్లు పైకి కిందకి కదిలింది.

ధనం అన్నది ఎన్నికలకు అత్యంత ముఖ్యమైన ముడిసరుకు గా మారిపోయిన ప్రస్తుత కాలంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలకు( Political Parties ) భిన్నంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని చూడటం ఆ పార్టీకి చాలా వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది.

పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు డబ్బులు పంచి జనసేన అభ్యర్థి డబ్బులు పంచకపోవడంతో ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థులపై పడి పార్టీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది.

అయినప్పటికీ చాలా చోట్ల గణనీయమైన స్థాయిలోనే ఓట్లు తెచ్చుకుంది.అయితే సమాజంలో మార్పు ఒక్కసారిగా రాదు అని ఉన్న పరిస్థితులను సమర్థవంతంగా ఉపయోగించుకొని ఒకసారి అధికారం సాధిస్తే అప్పుడు తామనుకున్న మార్పులను చేయొచ్చ అన్న నయా రాజకీయ వ్యూహాన్ని ఇప్పుడు జనసేనాని అందిపుచ్చుకున్నట్లుగా ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే అర్థమవుతుంది.

"""/" / ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో( Constituencies ) తమ పలుకుబడితో ప్రభావితం చేయగలిగిన అభ్యర్థులను ఇప్పుడు పార్టీలోకి చేర్చుకోవడంతో జనసేనాని వ్యూహం మార్చుకున్నట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పొత్తును క్క్షేత్ర స్తాయిలో కొంత మంది కార్యకర్తలు అభిమానులు వ్యతిరేకిస్తునప్పటికి మారుతున్న రాజకీయ పరిస్థితులను అందిపుచ్చుకోవడం కోసం జనసేన కొంత దూకుడు గానే వెళ్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు ( Chandrababu )అరెస్ట్ తర్వాత వేగంగా పడిపోతున్న తెలుగుదేశం గ్రాఫ్ ను నిలబెట్టడం ద్వారా ఆ పార్టీకి ఆప్తమిత్రుడుగా మారిపోయిన పవన్ ఇప్పుడు పొత్తులో భాగంగా తాను కోరుకున్న సీట్లను పట్టుపట్టి సాదించడానికి అవకాశం దక్కింది.

"""/" / అంతేకాకుండా సమన్వయ కమిటీ భేటీ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన లోకేష్ ( Lokesh )కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు అని గట్టిగా చెప్పలేని స్థితికి చేరుకున్నారంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యూహం పని చేస్తున్నట్లే భావించవచ్చు .

చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఫైనల్ కాకుండానే జరుగుతాయి అన్న వాతావరణం కనిపిస్తుంది .

చివరి వరకూ గుప్పెట మూసి ఉంచడం ద్వారా ముఖ్యమంత్రి పదవి కి తనకి కూడా అవకాశం ఉందన్న సంకేతాలను పవన్ తన పార్టీ శ్రేణులతో పాటు తనకు బలంగా అండగా నిలబడుతున్న సామాజిక వర్గానికి ఇచ్చినట్లవుతుందని దాంతో పవన్ కోసం ఆయా వర్గాలు కష్టపడి పని చేసె అవకాశం కనిపిస్తుంది అన్నది పార్టీ ఆలోచన గా కనిపిస్తుంది .

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా జనసేనకు బాగానే కలిసి వస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం సంక్షోభాన్ని జనసేన చాలా నేర్పుగా అందిపుచ్చుకుంది.

చివరి వరకూ తాను అనుకున్న వ్యూహాలను అమలు చేయగలిగితే మాత్రం జనసైనికులు కోరుతున్న స్థానంలోకి కచ్చితంగా జనసేన చేరుతుందని చెప్పవచ్చు.

యూకేలో 80 ఏళ్ల భారత సంతతి వృద్ధుడి హత్య.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలిక