జగన్ కాదు కూటమే టార్గెట్ .. షర్మిల లో మార్బుకు కారణం ఎవరు ? 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Ys Sharmila ) మొదటి నుంచి తన అన్న వైసిపి అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుంటూనే వచ్చారు.

గత వైసిపి ప్రభుత్వం లోని వైఫల్యాలను హైలెట్ చేస్తూ.  వాటిని జనాల్లోకి తీసుకువెళ్లి ఒకరకంగా వైసిపి ఓటమికి కాస్తో కూస్తో షర్మిల కారణం అయ్యారు.

రాజకీయంగాను , వ్యక్తిగతంగాను షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకోవడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో ఎక్కువమంది జగన్ కు మద్దతు పలుకుతుండడంతో వారిలో చీలిక తెచ్చే విషయంలోనూ షర్మిల అనుకున్న మేర సక్సెస్ అయ్యారు.

  ఏపీలో టిడిపి , జనసేన, బిజె( TDP, Janasena, BJp )పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైసిపిని, జగన్ ను టార్గెట్ చేసుకునే రాజకీయంగా షర్మిల విమర్శలు చేస్తూ వస్తున్నారు.

సిద్ధాంత పరంగా టిడిపి , జనసేన, బిజెపి కూటమికి తాము వ్యతిరేకమని చెబుతూనే జగన్ ను టార్గెట్ చేసుకోవడంపై వైసీపీ కూడా విమర్శలు చేసింది.

  అయితే అనూహ్యంగా షర్మిల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. """/" / కొద్దిరోజుల క్రితం విజయవాడలో సంభవించిన వరదల విషయంలోనూ జగన్ పై విమర్శలు చేసి పరోక్షంగా కూటమికి మద్దతుగా మాట్లాడారు .

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని షర్మిల విమర్శలు మొదలుపెట్టడంతో,  షర్మిలలో మార్పుకు కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని షర్మిల విమర్శలు చేశారు.కేంద్ర నుంచి నిధులను రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని షర్మిల విమర్శించారు.

  అటువంటప్పుడు అసలు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు .తక్షణం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు .

"""/" / కర్ణాటక( Karnataka )లో జగన్ నివాసం లో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో,  అనూహ్యంగా షర్మిల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ టార్గెట్ చేయకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల నుంచి సూచనలు రావడంతోనే షర్మిల కూడా ఇప్పుడు జగన్ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ వరల్డ్ లోనే బెస్ట్ దేశం అది.. మన దేశం ఏ స్థాయిలో ఉందంటే?