ఏపీలో వచ్చేది కూటమి సర్కారే..: కిరణ్ కుమార్ రెడ్డి
TeluguStop.com
ఏపీలో వచ్చేది ఎన్డీయే( NDA ) ప్రభుత్వమేనని, సీఎం చంద్రబాబే అవుతారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ( CM Kiran Kumar Reddy )అన్నారు.
ఇటీవల బీజేపీలో చేరిన ఆయన రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారన్న సంగతి తెలిసిందే.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దోపిడీ మాత్రమే జరిగిందని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారన్న ఆయన వారి కోసం జగన్ ఏమైనా మంచి చేశారా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఏపీలో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు వేయాలన్నారు.
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ( YCP ) ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు.
జపాన్ లో ఆ తేదీన రిలీజ్ కానున్న దేవర.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?