అలయన్స్ ఎయిర్ నిర్లక్ష్యం..! శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల పడిగాపులు..

హైదరాబాదులో అలయన్స్ ఎయిర్ లైన్స్ వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈరోజు ఉదయం 9 గంటలకు శంషాబాద్ నుంచి కొల్హాపూర్ వెళ్లాల్సిన విమానం అందుబాటులోకి రాలేదు.

విమానం షెడ్యూల్ ని ఇప్పటికి నాలుగు సార్లు అలయన్స్ ఎయిర్ మార్చిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ఉదయం నుంచి ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు.ఉదయం నుంచి ఇప్పటివరకు అసలు విమానం ఉందో లేదో అనే సమాచారం కూడా అలయన్స్ ఎయిర్ సిబ్బంది చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో విమానాశ్రయంలోని గేట్ నెంబర్ 10 వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు.అలయన్స్ ఎయిర్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, ఇప్పటికైనా స్పందించి సమాధానం చెప్పాలని కోరుతున్నారు.

హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ కానుందా?