ఇల్లంతకుంట మండల వడ్డెర సంఘం అధ్యక్షుడిగా అల్లెపు రజినీకాంత్

తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రం లో జిల్లా అధ్యక్షులు పలప లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండల నూతన కమిటీని అన్ని గ్రామాల సహకారంతోటి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇల్లంతకుంట మండల వడ్డెర అధ్యక్షుడిగా అల్లెపు రజినీకాంత్, మండల ఉపాధ్యక్షులుగా అల్లెపు మల్లయ్య, బోధస్ లచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా గండికోట తిరుపతి, కార్యదర్శిగా దండ్ల రాజు,కార్యవర్గ సభ్యులుగా గొల్లెన రాజు, అల్లెపు కనకయ్య, వల్లెపు శ్రీను, సలహాదారుగా దండ్ల రవి,కోశాధికారిగా బోదాసు సంజీవ్,యూత్ అధ్యక్షుడిగా గొలుసుల స్వామి, ఉపాధ్యక్షుడిగా దండ్ల చందు, ప్రధాన కార్యదర్శిగా దండ్ల సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వివిధ మండల అధ్యక్షులు కురదల కొమురయ్య,దండుగుల వంశీకృష్ణ, శివరాత్రి దేవయ్య, సూర రాము, జిల్లా నాయకులు గోగుల రమేష్,శివరాత్రి అయిలయ్య, యాపగాలు సంతోష్, ఉప సర్పంచ్ రమేష్, ముద్దం ప్రవీణ్, అల్లపు శ్రీనివాస్, దండ్ల రవి, కోమ్మరాజుల తిరుపతి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అమెరికా రాష్ట్ర సభలు, లోకల్ బాడీల బరిలో ప్రవాస భారతీయులు .. ఎంత మందో తెలుసా?