రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు పథకంపై ప్రతిపక్షాల ఆరోపణలు -తడకమళ్ళ రవికుమార్
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై అవగాహన లేని ప్రతిపక్ష నేతలు కావాలనే రాజకీయ లబ్ధికోసం ఆరోపణలు చేస్తున్నారనితుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తడకమళ్ళ రవికుమార్ అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి పథకమని,ప్రతి
దళిత కుటుంబానికి రూ.
10 లక్షల ఇస్తూ కూలీలుగా జీవిస్తున్న దళితులను ఓనర్లుగా చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని
అన్నారు.
దళిత బంధు మీద విమర్శలు చేయడం మీ యొక్క దిగజారుడు తనానికి నిదర్శనమని, మా ఎమ్మెల్యేని విమర్శిస్తే ఊరుకునేది లేదని,మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మీ పార్టీలకు 2023 ఎన్నికల తర్వాత పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరించారు.
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత… అదే నా కోరిక అంటూ?