అల్లరి నరేష్‌ ‘ఉగ్రం’ ప్రివ్యూ

అల్లరి నరేష్‌ ( Allari Naresh )కామెడీ హీరోగా చేసిన సమయంలో మినిమం గ్యారెంటీ హీరో అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు.

కానీ కొంత కాలం తర్వాత ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గింది.దర్శకులు ఆయన్ను ప్రేక్షకులు ఆశించినట్లుగా చూపించడంలో విఫలం అయ్యారు.

దాంతో అల్లరోడి కామెడీ సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన విషయం తెల్సిందే.

"""/" / దాంతో కాస్త గ్యాప్‌ తీసుకుని విజయ్ కనకమేడల( Vijay Kanakamedala ) దర్శకత్వంలో నాంది అనే సినిమాను చేసిన విషయం తెల్సిందే.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అంతే కాకుండా అల్లరోడిని ప్రేక్షకులు విభిన్నమైన పాత్రలో చూసి నచ్చారు.

నరేష్‌ ఇలాంటి సినిమాలో కూడా భలే నటించాడు అంటూ కామెంట్స్ వచ్చాయి. """/" / సాధారణంగా కామెడీ హీరోలు సీరియస్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపించరు.

కానీ నరేష్ నాంది సినిమాలో చేసిన పాత్రకు అంతా కూడా ఫిదా అయ్యారు.

దాంతో మరోసారి ఆ తరహా పాత్రను చేసేందుకు అల్లరోడు సిద్ధం అయ్యాడు.మరోసారి విజయ్ కనకమేడల దర్శకత్వం లోనే ఉగ్రం( Ugram ) అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

"""/" / రేపు విడుదల కాబోతున్న ఉగ్రం సినిమా లో అల్లరి నరేష్ ను మరో లెవల్‌ సీరియస్ పాత్రలో చూడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఉగ్రం సినిమా కచ్చితంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఉగ్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు తెగ హడావుడి చేస్తున్నారు.ఉగ్రం సినిమా చిత్రీకరణ సమయం నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పుడు ప్రమోషన్‌ కూడా భారీగా చేయడం వల్ల మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

సినిమా ఎలా ఉందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే.