4 రోజుల్లో 500 సిగరెట్లు.. ‘ఉగ్రం’ కోసం నరేష్ రిస్క్!

అల్లరి నరేష్ (Allari Naresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా సత్తా చాటు కున్నాడు.

అల్లరి సినిమాతో గుర్తింపు తెచ్చుకుని తన పేరు ముందు అల్లరి అని పెట్టుకున్నాడు.

మంచి మంచి హిట్స్ అందుకుంటున్న సమయంలో ప్లాప్ సినిమాల కారణంగా అల్లరి నరేష్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

"""/" / వరుస ప్లాప్స్ ఎదురవడంతో రేస్ లో వెనక పడ్డాడు.హిట్స్ ప్లాప్స్ సంబంధం లేకుండా సినిమాలు చేసే అల్లరి నరేష్ ప్లాప్స్ దెబ్బతో ఆచితూచి సినిమాలు చేయాల్సి వచ్చింది.

అయితే ఇంతకు ముందు నరేష్ కామెడీ సినిమాలను ఎంచుకునే వాడు.కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈయన రూటు మార్చినట్టు కనిపిస్తుంది.

నాంది సినిమా నుండి ఈయన కొత్తగా ట్రై చేస్తున్నాడు.ఇక ఇప్పుడు ఉగ్రం (Ugram Movie) సినిమా చేసిన నరేష్ ఈ సినిమాతో మే 5న రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నాడు.తాజాగా అల్లరి నరేష్ ఏకంగా 500 సిగరెట్లు నాలుగు రోజుల్లోనే తాగేసినట్టు చెప్పి షాక్ ఇచ్చాడు.

హీరోలు సినిమా కోసం ఏమైనా చేస్తారు.కొన్ని సార్లు అలవాట్లు లేని పని కూడా చేయాల్సి వస్తుంది.

"""/" / ఈ నేపథ్యంలోనే అల్లరి నరేష్ ఉగ్రం సినిమా కోసం నాలుగు రోజుల్లోనే 500 సిగరెట్లు తాగినట్టు తెలిపాడు.

ఆ తర్వాత మోతాదుకు మించి తాగడం వల్ల ఆరోగ్యం పాడయ్యి.మరుసటి రోజు నుండి షూట్ కు బ్రేక్ ఇచ్చారని తెలిపాడు.

మరి ఆ సీన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.ఇక విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మిర్నా (Mirnaa) హీరోయిన్ గా నటించింది.

చూడాలి ఎలాంటి హిట్ అందుకుంటాడో.