అసదుద్దీన్ కారుపై కాల్పుల కేసులో అలహాబాద్ కోర్టు తీర్పు కొట్టివేత

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై జరిగిన కాల్పుల కేసులో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

ఈ కేసులో నిందితుల బెయిల్ పై అలహాబాద్ కోర్టు తీర్పును కొట్టేసింది సర్వోన్నత న్యాయస్థానం.

నిందితుల రిమాండ్ పై తిరిగి విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా నిందితుల బెయిల్ మంజూరుకు హైకోర్టు కారణం చెప్పలేదని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ఈ మేరకు నిందితులు వారం రోజుల్లో లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.

సూపర్ లాంగ్ అండ్ షైనీ హెయిర్ కోసం ఇది ట్రై చేయండి..!