గడప గడపకు నిరసన సెగలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆళ్ల నాని.

ఏలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ల నాని నేడు 25 డివిజన్ లో 59వ రోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

స్థానిక ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి, మాకు న్యాయం చెయ్యాలి న్యాయం చెయ్యాలి అంటూ ఫ్లకార్డుస్ తో మహిళలు స్వాగతం పలికారు.

25వ డివిజన్ కు సంబంధించిన స్థానికులకు ఎక్కడో లక్ష్మీపురంలో జగనన్న ఇళ్లు ఇచ్చారు, మా శనివారపు పేటలో బయట వాళ్లకు స్థలాలు కేటాయించారని, మా డివిజన్లో మాకే స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేకు ఆందోళనతో 25వ డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

పోలీసులు నిరసన చేస్తున్న మహిళలను నిర్బంధించి స్టేషన్కు తరలించారు.

దీపికా పదుకొనేకు ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్ మాత్రం కాదంటూ?