గోవా సీఎం మనోహర్ పారికర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.. ముక్కులో సెలైన్ తోనే అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు..

గోవా సీఎం మనోహర్ పారికర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు .

ముక్కులో సెలైన్ తోనే అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు.గోవా కి 4 సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన మనోహర్ పారికర్ ఇక లేరు , ఆయన మార్చ్17 వ తేదీ సాయంత్రం తుది శ్వాస విడిచారు.

ఆయన చదువుకుంది ఐఐటీ కానీ రాజకీయాల్లో ఆయనే మేటి .ఐఐటీ విద్యను అభ్యసించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి ఆయనే.

గోవా లోని మపూసలిలో 1955 ,డిసెంబర్ 13 న మనోహర్ జన్మించారు.తన పాఠశాల రోజుల నుండే ఆర్ ఎస్ ఎస్ లో క్రియాశీలకంగా పనిచేశారు.

1994 లో తొలిసారి గోవా శాసన సభ కి ఎన్నికయ్యారు , 1998 99 నాటికి గోవా ప్రతిపక్ష నేతగా ఎదిగారు.

2000 అక్టోబర్ 24 న మనోహర్ పారికర్ తొలిసారిగా గోవా కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన కి దేశ భక్తి ఎక్కువ అలాగే ప్రజలకి మంచి చేయాలని తపన ఆ తపనే ఆయనను నాలుగు సార్లు గోవా సీఎం పీఠం పైన కూర్చోబెట్టింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మనోహర్ పారికర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు 1.

మనోహర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన తన సొంత ఇంట్లోనే నివసించేవారు , తను ప్రతిపక్షం లో ఉన్నపుడు వాడిన ఇన్నోవా కారు నే ముఖ్యమంత్రి అయ్యాక కూడా వాడారు.

2.మనోహర్ ముఖ్యమంత్రి లా కాకుండా సామాన్య ప్రజలతో బయట తిరిగే వారు , అతను ఎక్కువగా రిక్షా , ఆటోలలో ప్రయనించేవారు.

ఆయన విమనలలో కూడా ఎకనామిక్ క్లాస్ లొనే ప్రయనించేవారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 3.

ఆయన 60 ఏళ్ళ వయసు పై బడిన వారైనా కూడా రోజుకు 16 గంటలు పని చేసేవారు.

4.గోవా లో అక్రమంగా మైనింగ్ చేసేవాళ్ళ లైసెన్స్ రద్దు చేశారు అందుకే గోవా లో ప్రజలు ఈయనని " గోవా యొక్క మిస్టర్ క్లీన్ " అంటారు.

5.మనోహర్ పారికర్ తొలిసారిగా 2000 వ సంవత్సరం లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మరుసటి సంవత్సరమే భార్యను కోల్పోయారు , అయిన ఆయన మనో ధైర్యం తో ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రం మరవలేదు , ఆయనకి ఇద్దరు కుమారులు ఉత్పల్ , అభిజిత్.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 6.ఈయన పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్.

7.ఆయన కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నారు , అమెరికాలో వైద్యం చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడలేదు .

ఇటీవల ఆయన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముక్కు లో సెలైన్ పైపుతోనే గోవా అసెంబ్లీ కి వచ్చారు.

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టి పనిపట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు