ఆరోగ్య మహిళా” కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి అన్నారు.

తంగల్లపల్లి మండలం నేరెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గత రెండు వారాల్లో వచ్చిన మహిళలకు చేసిన పరీక్షలు వాటి రిపోర్టులను పరిశీలించి అధికారులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు.

విఐఎ పరీక్షలను సాధ్యమైనంత ఎక్కువ మందికి చేయాలన్నారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఒబేసిటీ, రక్త, మూత్ర పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు, న్యూట్రిషన్ మొదలైన పరీక్షలను స్థానిక ఆసుపత్రిలో చేసి రోగనిర్ధారణ అనంతరం నివారణ కోసం మందులు ఇవ్వడంతో పాటు అవసరం ఉన్నవారికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫరల్ చేయనున్నట్లు ఆమె తెలిపారు.

గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలు వైద్య పరీక్షలు చేయించుకోలేని స్థితిలో ఉన్న మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్, జిల్లా ఉప వైద్యాధికారి రజిత, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆ హిట్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్.. వరుస ఫ్లాపులకు బ్రేక్ పడినట్లేనా?