భారీస్థాయిలో బాలయ్య 50 ఏళ్ల సినిమా ప్రస్థాన వేడుకలు.. ఆ హీరోలు హాజరవుతారా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం బాలకృష్ణ( Balakrishna ) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో రాణిస్తున్నారు.

అయితే రెండు వైపులా వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఇది వలె జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బాలయ్య బాబు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.

మరోవైపు సినిమాల్లో వరుసగా మూడు సినిమాలతో భారీ విజయాలను అందుకుని హ్యాట్రిక్ ను అందుకున్నారు.

ఇలా ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో క్షణం కూడా తిరిగి లేకుండా గడుపుతున్నారు బాలయ్య బాబు.

"""/" / ఆ సంగతి పక్కన పెడితే సెప్టెంబర్ 1న బాలయ్య బాబు 50 ఏళ్ల సినిమా ప్రస్థాన వేడుకలను ఘనంగా చేయడానికి ప్లాన్ చేశారు.

దానికి తోడు ఇటీవల టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో బాలయ్య సినిమా ప్రస్థాన వేడుకలను మరింత గ్రాండ్ గా భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల నుంచి భారీగా అభిమాన జ‌నం వస్తారు.కానీ పెద్దలు ఎవరెవరు వస్తారు అన్నది పాయింట్.

కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సెలబ్రిటీ పేరు కూడా వినిపించలేదు.ఇక బాలయ్య బాబు సినీ ప్రస్థానం వేడుకకు తప్పకుండా నారా లోకేష్( Nara Lokesh ) అలాగే నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu ) ఇద్దరు వస్తారు.

వీటితోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

"""/" / అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే రాజకీయ నేతల సంగతి పక్కన పెడితే సినిమా రంగం నుంచి ఎవరెవరు వస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లాంటి నందమూరి హీరోలు వస్తారా రారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

అలాగే అక్కినేని హీరోలు కూడా వస్తారా రారా అన్నది కూడా క్వశ్చన్ గా మిగిలిపోయింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్, లాంటివారు తప్పకుండా వస్తారు.ఒకవేళ చిరంజీవి వస్తే కనుక ఆ సభకు మరింత కల వస్తుందని చెప్పవచ్చు.

ఇలా అటు నందమూరి హరికృష్ణ, అక్కినేని, మెగాస్టార్, మంచు ఫ్యామిలీ జ‌నాలు బాలయ్య అభినందన సభకు వస్తే ఆ లుక్ వేరుగా వుంటుంది.

బాలయ్య బాబు లాంటి సీనియర్ హీరో వేడుకలకు కాబట్టి యంగ్ హీరో నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు వస్తారు అని తెలుస్తోంది.

ఒకవేళ ఇదే గనుక నిజమైతే అభిమానులకు కన్నుల పండగే అని చెప్పవచ్చు.

ఆ సమయంలో రాజ్ తరుణ్ ను నేనే పోషించాను.. లావణ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!