దారులన్నీ క్లోజ్.. బాబుకి మైండ్ బ్లాక్ !

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ముఖ్యంగా టీడీపీ వైసీపీ మద్య రోజురోజుకూ పెరుగుతున్న పోలిటికల్ వార్ అంచనాలకు అందని రీతిలో కొనసాగుతోంది.

గత వారం రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) టార్గెట్ గా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణంలో రూ.118 కోట్లు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఇటీవల ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రచ్చ కొనసాగుతుండగానే 2015లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం జరిగిన అవకతవకలలో తాజాగా చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కోసం పలు సంస్థలతో రూ.3,356 కోట్ల ఒప్పందం జరిగింది.

"""/" / ఇందులో రూ.241 కోట్లు దారి మళ్లించారని ఆరోపణలు రావడంతో 2020లో జగన్ సర్కార్ విచారణకు ఆదేశించింది.

అప్పుడు విజిలెన్స్, ఏ‌సి‌బి పలు మార్లు విచారణ జరిపిన తరువాత ఈ కేసు సీఐడీ( CID ) కేటాఫ్ చేసింది.

తాజాగా ఆధారాలతో సహ అవినీతి నిర్ధారణ జరిగిందని సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది.

దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే బాబు తన అరెస్ట్ ను ముందుగానే ఊహించారా అనే సందేహాలు రాక మానవు.

ఎందుకంటే తనపై రూ.118 కోట్ల వ్యవహారంలో నోటీసులు జారీ అయినప్పుడే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, జగన్ సర్కార్( YS Jagan Mohan Reddy ) కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు.

"""/" / అనుకున్నట్లుగానే తాజాగా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.దీన్ని బట్టి చంద్రబాబు తాను చేసిన అవినీతిని ముందుగానే ఒప్పేసుకున్నారా అనే డౌట్లు వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్నా ఈ నాటకీయ పరిణామాలపై చంద్రబాబుగాని టీడీపీ శ్రేణులు గాని ఘాటుగా స్పందించలేదు.

దీంతో ఎన్నికల ముందు బాబు కు చెక్ పెట్టేందుకు జగన్ వేసిన ప్లాన్స్ గట్టిగా వర్కౌట్ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఊహించని విధంగా ఎదురైన ఈ పరిణామాలతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందని, వీటినించి బయటపడడం కష్టమే అని కొందరు రాజకీయే వాదులు చెబుతున్నారు.

మరి బాబు ఎలా బయటపడటారో చూడాలి.

మరో రెండు పథకాల అమలుకు రేవంత్ రెడ్డి రెడీ