కీలక నేతలంతా అసెంబ్లీకే.. బీజేపీ అధిష్టానం నిర్ణయం ఇదే ?
TeluguStop.com
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి ( BJP )అనేక ప్రయత్నాలు చేస్తుంది.
బీఆర్ఎస్ ( BRS )ను ఓడించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ అగ్ర నేతలు ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడంతో, ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే సులువుగా లోక్ సభ స్థానాలను గెలుచుకోవచ్చనే వ్యూహంతో బిజెపి అధిష్టానం ఉంది.
అందుకే అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని, జనబలం పెంచుకుని బిజెపి వైపు అందరి దృష్టి పడేవిధంగా చూడాలని, ఎప్పటికప్పుడు బిజెపి అధిష్టానం పార్టీ నేతలకు సూచనలు చేస్తూనే వస్తుంది.
"""/" /
ఇటీవల కాలంలో కాంగ్రెస్( Congress ) లోకి చేరికలు పెరుగుతుండడం ఒకపక్క ఆందోళన కలిగిస్తున్నా, మరోవైపు బిజెపిలోకి అంతే స్థాయిలో చేరికలు చోటు చేసుకోవడం బీఆర్ఎస్ కాంగ్రెస్ లోని కీలక నేతలు బిజెపిలోకి వచ్చే అవకాశం ఉండడంతో, చేరికల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
ఇక తెలంగాణ బీజేపీకి చెందిన ముఖ్య నాయకులంతా తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని బిజెపి అగ్రనాయకత్వం ఆదేశించిందట.
వీరిలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నట్లు సమాచారం.దీనికి సంబంధించి రెండు రోజులుగా ఢిల్లీలో( Delhi ) పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర నాయకుల సమావేశ సందర్భంగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
నిన్ననే దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతున్న తీరుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
"""/" /
2019 ఎన్నికలతో పోల్చితే దక్షిణాది నుంచి ఎక్కువగా ఎంపీ సీట్లు గెలిచేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోది సూచించినట్లు బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.
దీనిలో భాగంగానే తెలంగాణలో పార్టీని( Telangana ) మరింత బలోపేతం చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని , వాటిపైనే దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు మా ఇక అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ బిజెపికి చెందిన కీలక నాయకులంతా సిద్ధంగా ఉండాలని, అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ క్షేత్రస్థాయి నుంచి వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యంగా రాష్ట్రంలోని 19 ఎస్సీ 12 ఎస్టి రిజర్వడ్ సీట్లలో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు అమలు చేయాలని, సూచించినట్లు సమాచారం .
అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై అంశాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, స్థానికంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని , ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ,దళిత బంధు వంటి ప్రధాన అంశాలపై ఫోకస్ పెట్టి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాలని సూచించినట్లు సమాచారం.
ఈనెల 20 నుంచి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లకు చెందిన 119 మంది బిజెపి ఎమ్మెల్యేలు వారం రోజులపాటు పర్యటించనున్నారు.
వారంతా ఏడు రోజులు తమకు కేటాయించిన నియోజకవర్గంలోనే పర్యటిస్తారు.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?