ఈ డాబాలో అన్ని ఆహారపదార్ధాలు కుక్కర్‌లోనే తయారీ… క్షణాల్లో రెడీ చేసి వడ్డిస్తారు!

చిన్న టిఫిన్ కొట్టునుండి హోటల్స్, రెస్టారెంట్లు, డాబాలు ఇలా చాలా చోట్ల మనం సందర్భం వచ్చినపుడు ఆహారాన్ని సేవిస్తూ ఉంటాం.

మీరు గమనిస్తే ఒక్కో దగ్గర ఒక్కో రకమైన వంట విధానాన్ని ఫాలో అవుతూ వుంటారు.

చాలా చోట్ల పెద్ద పెద్ద పాత్రల్లో వంటకాలు వండిన తరువాత అందైమన పాత్రల్లో ఆహారాన్ని తెచ్చి వడ్డిస్తుంటారు.

సాధారణంగా ఎక్కడైనా ఇదే విధంగా ఫుడ్ ని ప్రాసెస్ చేస్తారు.కానీ ఓ డాబాలో మాత్రం వెరైటీగా వండుతున్నారు.

అవును, ఇక్కడ మనం గమనిస్తే, ఎలాంటి ఆహారాన్నైనా కుక్కర్లలోనే వండి వార్చుతారు.ఇంకేముంది కట్ చేస్తే నిమిషాల్లోనే.

భోజనం రెడీ అయి మీ ముందుకు వస్తుంది.ఇక ఆ షాపులో వున్న కుక్కర్లు చూస్తే.

ఎవరైనా కుక్కర్‌ షాపు అని పొరపాటు పడుతూ వుంటారు.అంతలా అక్కడ కుక్కర్ల వాడకం విరివిగా జరుగుతుంది.

అందుకే దానికి కుక్కర్ దాబా( Cooker Dhaba ) అనే పేరు కూడా వచ్చింది.

వివరాల్లోకి వెళితే, కర్నాటక రాష్ట్రం( Karnataka ) కలబురగిలోని కపనూర్ ఇండస్ట్రీస్ సమీపంలోని సంజయ్‌కు చెందిన సిటీ హైవే దాబా ఉంది.

దానిని స్థానికులు "కుక్కర్ దాబా" అంటారు.పది నిమిషాల్లో వేడివేడిగా కుక్కర్‌లోనే వండిన రుచికరమైన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తారు.

ఇక్కడ ఫుడ్ బాగా పాపులర్ అవ్వడంతో కుక్కర్‌ ఫుడ్ రుచి చూడడానికే నిత్యం వందలాది మంది వస్తుంటారు.

"""/" / కస్టమర్ వచ్చి ఆర్డర్ చేసి పది పదిహేను నిమిషాలు కూడా కాకుండానే.

అంటే వారి సమయం పెద్దగా వృధా కాకుండానే వండిన వేడి వేడి ఆహారం కస్టమర్ టేబుల్‌పై ఉంటుంది.

చికెన్, మటన్ , అన్నం( Non-Veg ) వంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ ఆర్డర్ చేయడగానే తయారుచేస్తారు.

ఇక్కడ ఏదీ ముందుగా రెడీ చేసి ఉంచరు.అందుకే ఈ దాబా అంత ఫేమస్ అయ్యింది.

ఇక్కడ లభించే మరో ప్రత్యేక ఆహారం స్పెషల్ సితి రైస్.ఈ రైస్ టేస్ట్ అనేది.

కలబురగి ప్రజలను ఆకర్షిస్తోంది.మీరు ఎపుడైనా ఆ వైపుగా ప్రయాణిస్తే అక్కడ ఆహారాన్ని రుచి చూసి వెళ్ళండి.

కార్తీ లడ్డు వివాదం పై మరోసారి రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?