కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి…

డైరెక్టర్ తేజ తీసిన లక్ష్మి కళ్యాణం అనే సినిమా తో తెలుగు తెర కి పరిచయం అయిన కాజల్( Kajal Aggarwal ) ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ కృష్ణవంశీ తీసిన చంద‌మామ సినిమాతో కాజ‌ల్ అగ‌ర్వాల్ కి ఒక మంచి హిట్ అయితే దక్కింది.

ఇక ఆ అత్రవత రామ్ చరణ్ తో చేసిన మగధీర సినిమా( Magadheera Movie ) ఇండస్ట్రీ హిట్ అయింది.

దీంతో ఆమె అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ తో పాటు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ అగ్ర హీరోల‌తో ఆడిపాడింది.ఏజ్ బార్ అవ్వ‌కుండా పెళ్లి పీట‌లు కూడా ఎక్కేసింది.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌత‌మ్ కిచ్లూతో ఏడ‌డుగులు వేసిన కాజ‌ల్‌.గ‌త ఏడాది పండంటి మగ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

బిడ్డ పుట్టిన త‌ర్వాత పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ అయింది.ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో భగవంత్ కేసరి అనే మూవీ చేస్తోంది.

అలాగే కోలీవుడ్ లో క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియ‌న్ 2` మూవీతో చేస్తోంది.

రీసెంట్ గా స‌త్య‌భామ‌ అనే లేడీ ఓరియెంట్ మూవీకి కూడా క‌మిట్ అయింది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.ఆరంభం నుంచి కాజ‌ల్ త‌న కెరీర్ ను ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటూ వ‌స్తోంది.

"""/" / అలాగే క‌థ‌ల ఎంపిక‌లో కాజ‌ల్ నిజంగా తోపని చెప్పాలి.ఈ విష‌యంలో కాజ‌ల్ ముందు మిగాతా హీరోయిన్లు వేస్టే.

ఎందుకంటే, తోటి హీరోయిన్ల మాదిరి అధిక‌ రెమ్యున‌రేష‌న్ కోసం ఆశ‌ప‌డ‌కుండా.త‌న పాత్ర మ‌రియు క‌థ‌పై ఎక్కువ ఫోక‌స్ పెడుతూ సినిమాల‌ను ఎంపిక చేసుకుంది.

ఈ క్ర‌మంలోనే ఎన్నో డిజాస్ట‌ర్ సినిమాల నుంచి చాలా తెలివిగా త‌ప్పించుకుంది.అలా కాజ‌ల్ రిజెక్ట్ చేసిన చిత్రాల్లో పైసా వ‌సూల్( Paisa Vasool Movie ) ఒక‌టి.

బాల‌కృష్ణ‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రంలో మొద‌ట హీరోయిన్ గా కాజ‌ల్ నే అడిగార‌ట.

భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశార‌ట‌. """/" / కానీ, క‌థ త‌న‌ను పెద్ద‌గా మెప్పించ‌క‌పోవ‌డంతో కాజ‌ల్ నో చెప్పింది.

క‌ట్ చేస్తే పైసా వ‌సూల్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.అలాగే ప్ర‌భాస్ `రెబ‌ల్‌` మూవీలో( Rebel Movie ) ఒక హీరోయిన్ గా కాజ‌ల్ ను తీసుకోవాల‌ని అనుకున్నారు.

కానీ, కాజ‌ల్ ఈ మూవీకి నో చెప్పింది.ఈ సినిమా సైతం ఫ్లాపే అయింది.

ఇక ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, నాగార్జున వైల్డ్ డాగ్‌, బాల‌కృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి వంటి ఎన్నో ఫ్లాప్ సినిమాలు కాజ‌ల్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ల లిస్ట్ లో ఉన్నాయి.

సీనియర్లు సర్దుకోవాల్సిందేనా ? బాబు సంకేతాలు ఇచ్చేశారుగా ?