జగన్ దైర్యమంతా.. వాళ్లే !

గత ఎన్నికల్లో వైసీపీ( YCP ) 151 సీట్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీ ఆ స్థాయి విజయాన్ని నమోదు చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిన జగన్ ( Jagan )నిరుద్యోగ ఓటర్లనందరిని తనవైపు తిప్పుకున్నారు.

దాంతో జగన్ గెలుపులో నిరుద్యోగుల పాత్ర కూడా చాలానే ఉందని చెప్పాలి.తీర అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో వాలెంటరీ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ( Voluntary System And Secretariat System ) ప్రవేశ పెట్టారు.

మొదట్లో ఈ వ్యవస్థలపై కొంత కన్ఫ్యూజన్ కు లోనైనప్పటికి ఆ తరువాత ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిలా ఈ వ్యవస్థలు పని చేస్తుండడంతో వాలెంటరీ వ్యవస్థపై సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో సానుకూలత ఏర్పడింది.

"""/" / ఇక ఇందులో ఉద్యోగాలు సాధించినవారు కూడా వైసీపీ సర్కార్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో వేరే ఏ ప్రభుత్వం వచ్చిన ఈ వ్యవస్థలు అలాగే అమలౌతయా లేదా అనేది సందేహమే.

దాంతో వాలెంటర్లు అలాగే సచివాలయ ఉద్యోగులు వైసీపీకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.

అయితే వైసీపీ సర్కార్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే అని టీడీపీ ( TDP )చెబుతోంది.

అయితే ఎంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నప్పటికి వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో వైఎస్ జగన్ కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.

దీనికి కారణం కూడా లేకపోలేదు.సచివాలయ ఉద్యోగులు, వాలెంటరీలు అలాగే లబ్ది పొందిన ప్రజలు వైసీపీకి అండగా నిలిచిన గెలుపు ఈజీ అనేది జగన్ అంచనా.

అందుకే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

"""/" / కాగా సచివాలయ వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చిన తీసివేయబోమని అటు జనసేన, ఇటు టీడీపీ రెండు పార్టీలు కూడా చెబుతున్నాయి.

దాంతో వీరంతా ప్రభుత్వ మార్పు వైపు చూస్తారా అనే చెప్పలేమనే సమాధానం వినిపిస్తోంది.

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయనికి వాలెంటరీలు, సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని జగన్ భావిస్తున్నారనే చెప్పవచ్చు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేసే ఇండస్ట్రీ లేదా..?