గణతంత్ర వేడుకలకు సర్వం సన్నద్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా: శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో నిర్వహించబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అనంతరం ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పని తీరు కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.

ఈ సందర్భంగా గురువారం సాయంత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఎన్.

ఖీమ్యా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కార్యాలయ సిబ్బంది అందరూ వేడుకలకు హాజరు కావాలని అన్నారు.

వేడుకలు సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పరిశీలనలో అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసంబంధాల అధికారి మామిండ్ల దశరథం, పరిపాలన అధికారి రాంరెడ్డి, సిరిసిల్ల తహశీల్దార్ షరీఫ్ మోహినుద్దీన్, తదితరులు ఉన్నారు.

అల్లు అర్జున్ అరెస్టుపై వేణు స్వామి భార్య షాకింగ్ కామెంట్స్… నేను ముందే చెప్పానంటూ?