ఢిల్లీలో ఈనెల 19న అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలో ఈనెల 19వ తేదీన అఖిలపక్ష సమావేశం జరగనుంది.ఈ మేరకు ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.

దాదాపు 17 రోజులపాటు జరిగే వర్షాకాల సమావేశాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరనుంది.

అదేవిధంగా వర్షాకాల సమావేశాల్లో తీసుకురానున్న బిల్లుల వివరాలను కేంద్రం అఖిలపక్షం ముందు ఉంచనుంది.

కాగా ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఫేక్ రికార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?