ఎడిటోరియల్ : దొరకని గ్రేటర్ ఓటర్ నాడి ! పెరిగిపోతున్న టెన్షన్ ?

ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది.ఇప్పటి వరకు అన్ని పార్టీలు తమ మాటలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుని గ్రేటర్ ఎన్నికలలో గట్టెక్కాలని ప్రయత్నాలు చేశాయి.

గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు అందరూ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కి దిగిపోయారు.

ఎప్పుడూ లేని విధంగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార పర్వం కొనసాగింది.అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో గ్రేటర్ పోరు సాగుతోంది.

ఇక్కడ  గ్రేటర్  పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో, ఆ పార్టీకి మాత్రమే రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో, ఇక్కడ గట్టెక్కేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మొన్నటి వరకు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అందరూ అంచనా వేయగా, బిజెపి అనూహ్యంగా దూసుకురావడంతో ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లడం, ఇలా ఎన్నో అంశాలు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుండడంతో,  గ్రేటర్ ఓటర్లు ఎవరివైపు ఉన్నారనేది ఉత్కంఠగా మారింది.

2014 ఎన్నికల నుంచి చూసుకుంటే ప్రతి ఎన్నికల్లోనూ,  టిఆర్ఎస్ ప్రభుత్వం తమ హవా చూపిస్తూ వచ్చేది.

ఈ గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సత్తా చాటుకుంటుంది అని ముందుగా అందరూ అంచనా వేసినా, అనూహ్యంగా బిజెపి తెలంగాణలో బలపడడం,  టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించే స్థాయిలో బలపడడం , గ్రేటర్ పీఠం కోసం టిఆర్ఎస్ తో నువ్వా నేనా అనే స్థాయికి తలపడే విధంగా వెళ్లడంం , ఇలా ఎన్నో అంశాలు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.

ఇక ఎన్నికలకు ముందే మెజారిటీ ఓటర్లు ఏ పార్టీ వైపు ఉన్నారు అనేది ముందుగా తెలిసిపోయేది.

అయితే ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఓటర్ నాడి తెలియడం లేదు. """/"/ ఇప్పటికే అనేక సర్వే సంస్థలు రంగంలోకి దిగడం , అలాగే వివిధ మీడియా చానళ్లు  క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు తమ ప్రతినిధులను రంగంలోకి దింపినా , ఏ పార్టీకి అవకాశం దక్కుతుంది అనే విషయం లో ఒక క్లారిటీ దొరకడం లేదట.

టిఆర్ఎస్, బిజెపి విషయంలోనూ ప్రజల్లో పెద్దగా లేకపోవడం,  కరోనా సమయంలో పేద మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాా,  ప్రభుత్వాలు సరైన విధంగా స్పందించడం లేదు అని ఆగ్రహం ప్రజల్లో ఉండడం, అలాగే ఇటీవల గ్రేటర్ పరిధిలో వరదల కారణంగా జనజీవనం అతలాకుతలం అవ్వడం , భారీగా ఆస్తి , ప్రాణ నష్టం జరగడం , అయిన ప్రభుత్వాల స్పందన అంతంత మాత్రంగానే ఉండడం,  వరద సహాయం సరిగా అందకపోవడం వంటి ఎన్నో కారణాలతో టిఆర్ఎస్, బిజెపి లు జన గ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి.

అయితే గ్రేటర్ లో తమను గెలిపిస్తే మరెన్నో  రకాలుగా అభివృద్ధి చేస్తామని టిఆర్ఎస్ చెబుతుంటే, బిజెపి గ్రేటర్ వరద బాధతులకు 25000 పరిహారంగా ఇస్తామని ప్రకటించగా, కాంగ్రెస్ ఈ పరిహారాన్ని 50 వేలకు పెంచింది.

అయినా గ్రేటర్ ఓటర్ నాడి ఏంటి ? ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది స్పష్టత తెలియకపోవడంతో అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.

అసలు తెలంగాణలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో అన్ని పార్టీలు ఈ గ్రేటర్ ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

కార్పొరేషన్ పరిధిలో జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు ఇంత టెన్షన్ పడుతున్న తీరు చూస్తుంటే, గ్రేటర్ ఎన్నికలలో ఫలితం ఎంత ప్రతిష్టాత్మకం అనేది స్పష్టం గా అర్థమైపోతోంది.

Hebah Patel Latest Images-ఎద అందాలతో కుర్రకారును పారేశాను చేస్తున్న..హెబ్బా పటేల్