వీరంతా సైలెన్స్…   రేవంత్ కు పెద్ద కష్టమే వచ్చిందే ?  

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిన (revanth Reddy) కి ఆ పార్టీలో పెద్ద కష్టమే వచ్చినట్టుగా కనిపిస్తుంది.

విపక్షాలు తనను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా, ఆ విమర్శలను తిప్పికొట్టే విషయంలో పార్టీ కీలక నేతలు, మంత్రులు అంత యాక్టివ్ గా ఉండకపోవడం, రేవంత్ (revanth Reddy)ఒక్కరే విపక్షాల విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం చేయడం వంటివన్నీ ఆయనకు ఇబ్బందికరంగా మారాయి.

ఇటీవలే లోక్  సభ ఎన్నికల తంతు ముగియడంతో, మంత్రులు పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు.

ప్రతిపక్షాలు చేసే విమర్శలను అంతగా పట్టించుకోవడం లేదు.దీంతో రేవంత్ తో పాటు ఇద్దరు, ముగ్గురు మంత్రులు మాత్రమే విపక్షాల విమర్శలకు సమాధానం చెబుతున్నారు.

"""/" / ఇటీవల లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తీరిక లేకుండా గడిపారు.

ఆ సమయంలో కాంగ్రెస్( Congress) పైన, రేవంత్ పైన బీఆర్ఎస్, బిజెపిలు (BRS, BJP)తీవ్రంగా విమర్శలు గుప్పించాయి.

కానీ ఈ విమర్శల ను తిప్పికొట్టేందుకు మంత్రులు ఎవరూ అంతగా ఆసక్తి చూపించనట్టుగా వ్యవహరిస్తున్నారు.

బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు మాత్రమే ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేయగా, మిగతా మంత్రులు ఎవరు ఈ విషయంలో స్పందన లేనట్టుగానే వ్యవహరించారు.

"""/" / బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్(KCR) ప్రభుత్వం పై ఎవరు విమర్శలు చేసినా అప్పటి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆ విమర్శలను తిప్పుకొట్టేవారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.దీంతో అన్ని రకాలుగాను రేవంత్ రెడ్డి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

 ఇదే అదునుగా విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్(BRS, BJP) నేతలు రేవంత్ ను మరింత ఇరుకున పెట్టె విధంగా రాజకీయ విమర్శలకు పదును పెట్టారు.

ఛీ, టాయిలెట్‌ బౌల్‌లో పక్షి మాంసం పెట్టి వండింది.. ఈ యువతికి మతిపోయిందా (వీడియో)