నావల్ల వాళ్ళందరూ అప్పుల పాలవుతున్నారు… సాయి పల్లవి కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకొని మంచి అవకాశాలను అందుకోవాలి అంటే హీరోయిన్స్ తప్పకుండా అందంగా కనపడుతూ, గ్లామర్ షో చేస్తేనే వారికి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు మనుగడ ఉంటుందని అందరికీ తెలిసిందే.

అయితే సాయి పల్లవి ( Saipallavi ) మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పాలి.

నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి మేకప్ వేసుకోదు, గ్లామర్ షో అంతకన్నా చేయదు కానీ ఈమె స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. """/" / తనకు కథ నచ్చితేనే అందులో ఎలాంటి గ్లామర్ షో లేకపోతేనే సాయి పల్లవి సినిమాలకు కమిట్ అవుతుంది ఒకవేళ గ్లామర్ షో చేయాల్సి వస్తే నిర్మొహమాటంగా అందులో స్టార్ హీరోలు నటిస్తున్నా తాను నటించనని మొహం మీద చెప్పేస్తుంది.

ఇలా సాయి పల్లవి నటన విషయంలో తనకంటూ కొన్ని పరిధులు( Limits ) పెట్టుకున్నారని చెప్పాలి.

ఈ విధంగా సాయి పల్లవి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అయితే గతంలో ఈమె నటించిన విరాటపర్వం( Virataparvam ) గార్గి ( Gargi ) వంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

"""/" / ఈ సినిమా తర్వాత సాయి పల్లవి చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యారు.

అయితే ఇలా సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను ఈమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఏదైనా ఒక సినిమాలో నటిస్తున్నాము అంటే ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకువచ్చేలా ఉండాలి కానీ వారికి నష్టాలు తీసుకువచ్చేలా ఉండకూడదని తెలిపారు.

కానీ నావల్ల కొందరు నిర్మాతలు( Producers ) అప్పుల పాలు అయ్యారు.ఆ విషయం నాకు ఏమాత్రం నచ్చలేదని సాయి పల్లవి తెలిపారు.

నావల్ల నష్టాలు వచ్చినప్పటికీ కొందరు నిర్మాతలు తిరిగి నాతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు.

కానీ వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేకే ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నానని అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా ఇంకా మంచి సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సాయి పల్లవి కమల్ హాసన్ ( Kamal Hassan ) నిర్మాణంలో శివ కార్తికేయ (Shiva Karthikeyan) నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

చెట్టుపైకి ఎక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. ఎలా రెస్క్యూ చేశారో చూడండి..