Hanuman : ఇక్కడే కాదు అక్కడ కూడా విజేతగా హనుమాన్.. తేజ మూవీని ఇతర భాషల హీరోలు ఆ రేంజ్ లో మెచ్చుకున్నారా?
TeluguStop.com
ప్రశాంత్ వర్మ( Prashanth Verma ) దర్శకత్వంలో తేజా సజ్జా( Teja Sajja ) హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్( Hanuman ).
తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది.
అంతేకాకుండా ఈ సినిమా అన్ని వర్గాల అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతోంది.
ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించడంతోపాటు ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
"""/" /
చిత్రాన్ని చూసి అందులోని నటుల యాక్టింగ్ కు, దర్శకుని ప్రతిభకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.
ఈ చిత్రాన్ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటన్నారు.కాగా ఈ సినిమా విడుదలైన రెండు రోజులు 2 తెలుగు రాష్ట్రాలలోని హనుమాన్ సినిమా నడుస్తున్న థియేటర్లు నిండిపోగా నెమ్మదిగా ఇప్పుడు ఇది బాలీవుడ్( Bollywood ) తో పాటు మిగతా రాష్ట్రాలకు పాకింది.
దీంతో టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో, ఓవర్సీస్ లలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను కూడా దాటి రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
రిలీజైన నాలుగు రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.
"""/" /
తాజాగా ఈ సినిమాను కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్ కూమార్, రిషబ్ షెట్టి, ధనుంజయ, తమిళ ఇండస్ట్రీ నుంచి రాధిక, శరత్ కుమార్, బాలీవుడ్ నుంచి మాధవన్, వివేక్ అగ్నిహోత్రి, మళయాళ పరిశ్రమ నుంచి ఉన్ని ముకుందన్, టాలీవుడ్ నుంచి రవితేజ, రామ్ పోతినేని, మంచు విష్ణు, నారా రోహిత్, గోపీచంద్, ఆర్జీవీ, సాయిధరమ్ తేజ్, నాని, వరుణ్ తేజ్, రాఘ వేంద్రరావు, వంటి హీరోలు, దర్శకులు చిత్ర యూనిట్, దర్శకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడమే కాక మెచ్చుకుంటున్నారు.
బాలకృష్ణ ప్రత్యేకంగా షో వేయించుకుని మరి సినిమా తిలకించి ప్రశాంత్ వర్మను పొగడ్తలతో ముంచెత్తారు.
వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి